ETV Bharat / state

నిరుద్యోగులకు హామీ ఇస్తున్నాం-పెద్దఎత్తున పరిశ్రమలు తెస్తాం, ఉద్యోగాలు కల్పిస్తాం: నారా లోకేశ్ - Yuvagalam Padayatra news

Nara Lokesh on Industries: గత ప్రభుత్వం తీసుకొచ్చిన పరిశ్రమలను వైసీపీ ప్రభుత్వం తరిమేసిందని టీడీపీ యువనేత నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో మూడు నెలల్లో అధికారంలోకి వస్తామని, మళ్లీ పరిశ్రమలను తీసుకొచ్చి యువతకు, నిరుద్యోగులకు పెద్దఎత్తున ఉద్యోగాలు కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

nara_lokesh_on_industries
nara_lokesh_on_industries
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 10, 2023, 9:59 PM IST

Updated : Dec 10, 2023, 10:16 PM IST

Nara Lokesh on Industries: 'రాష్ట్రంలో పెద్ద ఎత్తున పరిశ్రమలను ప్రోత్సహించాల్సి ఉంది. పరిశ్రమలు వస్తేనే యువతకు ఉద్యోగాలు వస్తాయి. తద్వారా అక్కడి స్థానికులకు మెరుగైన అవకాశాలు దొరుకుతాయి. మరో మూడు నెలల్లో ప్రజల ప్రభుత్వం ఏర్పడుతుంది. పరిశ్రమలను తీసుకొచ్చి, యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తాం. పరిశ్రమలు వస్తే గ్రామాల రూపురేఖలు మారిపోతాయి. నేను మంత్రిగా ఉన్నప్పుడు ఫోన్ల పరిశ్రమను తీసుకొచ్చా. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆ పరిశ్రమను తరిమేసింది. యువతకు, నిరుద్యోగులకు భరోసానిస్తున్నా అధికారంలోకి రాగానే పరిశ్రమలు తెచ్చి, ఉద్యోగాలు ఇస్తాం.' అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు.

Yuvagalam Padayatra Updates: టీడీపీ యువనేత నారా చేపట్టిన 'యువగళం' పాదయాత్ర ఆదివారం కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో ఉత్సాహంగా కొనసాగింది. నేటి (218వ రోజూ) పాదయాత్రను ఆయన ఒంటిమామిడి క్యాంప్‌ సైట్‌ నుంచి ప్రారంభించారు. దీంతో లోకేశ్‌కు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలుకగా, తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు ఆయనకు సంఘీభావం తెలిపారు. పాదయాత్రలో ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించిన యువనేత తొండంగి మండలం కృష్ణాపురం రోడ్డు కూడలి వద్ద నీట మునిగిన పంటలను పరిశీలించారు. కాలువ దాటి పొలంలోకి వెళ్లి, రైతులతో మాట్లాడారు. రైతులు నిరుత్సాహ పడొద్దని, మరో మూడు నెలలు ఓపిక పడితే తెలుగుదేశం, జనసేన ప్రభుత్వం వచ్చాక నష్టపోయిన ప్రతీ రైతును ఆదుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు.

ఉత్సాహంగా సాగిన లోకేశ్​ పాదయాత్ర- అడుగడుగునా నిరాజనం పలికిన యువత, మహిళలు

Lokesh Face to Face with Farmers: శృంగవృక్షంలో సెజ్ రైతులతో నారా లోకేశ్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి ప్రజలే గుణపాఠం చెబుతారని ఆయన పేర్కొన్నారు. కాకినాడ సెజ్ కోసం రైతులు త్యాగాలు చేశారన్న లోకేశ్ ఎన్నికలకు ముందు దాడిశెట్టి రాజా రైతులకు జగన్‌ హామీలు ఇచ్చి, మోసం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Lokesh Fire on YS Jagan Regime: వైఎస్ జగన్ పాలనలో తమకు న్యాయం చేయాలని ప్రశ్నించిన వారిని కఠినంగా హింసిస్తున్నారని నారా లోకేశ్ ధ్వజమెత్తారు. తనపై కూడా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, హత్య కేసు పెట్టారని గుర్తు చేశారు. 15 ఏళ్లపాటు సీఎంగా చేసిన వ్యక్తినే అక్రమంగా జైలులో పెట్టారని ఆగ్రహించారు. స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాల్సిందేనని లోకేశ్ డిమాండ్ చేశారు. జగన్ కటింగ్‌, ఫిటింగ్‌ మాస్టర్‌‌న్న ఆయన దేశంలోనే 100 సంక్షేమ పథకాలు కట్‌ చేసిన ఏకైక సీఎం జగన్‌‌నేనని దుయ్యబట్టారు. జగన్‌ రెండు బటన్‌లు నొక్కుతారని, అందులో పచ్చ బటన్‌ నొక్కితే రూ. 10 వస్తుంది, కిందనున్న ఎర్ర బటన్‌ నొక్కితే రూ.100 పోతుంది అని నారా లోకేశ్ విమర్శించారు.

నవంబర్ 27 నుంచి యువగళం పాదయాత్రకు సిద్దమవుతున్న నారా లోకేశ్ - ఎక్కడినుంచంటే?

''రాష్ట్రంలో తక్కువ కాలుష్యంతో పరిశ్రమలను తీసుకువచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. కియా పరిశ్రమ వల్ల వేలాది మంది జీవితాల్లో మార్పు వచ్చింది. ఆక్వా రంగంలో 10 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. కానీ, వైసీపీ ప్రభుత్వంలో ఆక్వా ఉద్యోగులు తరలివెళ్తున్నారు. నేను తెచ్చినా ఫోన్ల పరిశ్రమలో 6 వేల మంది పనిచేసేవారు. కానీ, వైసీపీ ప్రభుత్వం కక్ష్యగట్టి ఆ పరిశ్రమను తరిమేసింది. మూడు నెలల్లో అధికారంలోకి వస్తాం. పరిశ్రమలు తెచ్చి ఉద్యోగాలు ఇస్తాం.''-నారా లోకేశ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి

Nara Lokesh Open Letter to CM Jagan: ప్రభుత్వం తక్షణమే రైతులను ఆదుకోవాలి.. సీఎం జగన్‌కు నారా లోకేశ్ బహిరంగ లేఖ

నిరుద్యోగులకు హామీ ఇస్తున్నాం-పెద్దఎత్తున పరిశ్రమలు తెస్తాం, ఉద్యోగాలు కల్పిస్తాం: నారా లోకేశ్

Last Updated : Dec 10, 2023, 10:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.