ETV Bharat / state

బాధ కలిగినా తప్పలేదు.. అందుకే ఆ నిర్ణయం: మంత్రి విశ్వరూప్

ఏ మంత్రికైనా బాధ్యతలు తీసుకున్న వెంటనే ప్రజలపై భారం మోపటం బాధాకరమేనని రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. అన్నవరం సత్య నారాయణ స్వామిని దర్శించుకున్న ఆయన.. ఆర్టీసీని కాపాడుకునేందుకు తప్పని పరిస్థితుల్లో బస్సు ఛార్జీలు పెంచాల్సి వచ్చిందన్నారు.

బాధాకరమే అయినా.. తప్పక ఛార్జీలు పెంచాల్సి వచ్చింది

author img

By

Published : Apr 16, 2022, 4:42 PM IST

బాధాకరమే అయినా.. తప్పక ఛార్జీలు పెంచాల్సి వచ్చింది

రవాణా శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆర్టీసీ ఛార్జీలు పెంచాల్సి రావటం బాధాకరమేనని పినిపే విశ్వరూప్ అన్నారు. అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకున్న మంత్రి విశ్వరూప్.. ఆర్టీసీని కాపాడుకునేందుకు అనివార్యంగా ఛార్జీల పెంపు నిర్ణయం తీసుకున్నామన్నారు. తెలంగాణతో పోలిస్తే ఏపీలోనే ఛార్జీలు తక్కువ అని వెల్లడించారు. డీజిల్ ధర తగ్గగానే సెస్ తగ్గించేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. తిరుమలకు దశలవారీగా 100 ఎలక్ట్రిక్ బస్సులు నడుపుతామని మంత్రి విశ్వరూప్ వెల్లడించారు.

"ప్రమాణం చేసిన వెంటనే ఛార్జీలు పెంచాల్సి రావడం బాధాకరమే. ఆర్టీసీని కాపాడుకునేందుకు అనివార్యంగా తీసుకున్న నిర్ణయమిది. తెలంగాణతో పోలిస్తే మన రాష్ట్రంలో ఛార్జీలు తక్కువ. డీజిల్ ధర తగ్గగానే సెస్ తగ్గించేందుకు ప్రయత్నిస్తాం. తిరుమలకు దశలవారీగా వంద ఎలక్ట్రిక్‌ బస్సులు నడుపుతాం." -పినిపే విశ్వరూప్‌, రవాణా శాఖ మంత్రి

ప్రయాణికులపై భారం: డీజిల్ సెస్‌ పేరుతో ఏపీఎస్​ఆర్టీసీ ప్రయాణికుల ఛార్జీలను పెంచింది. పల్లెవెలుగు బస్సుల్లో రూ.2, ఎక్స్​ప్రెస్​ బస్సుల్లో రూ. 5, ఏసీ బస్సుల్లో రూ.10 చొప్పున డీజిల్ సెస్ వసూలు చేయనుంది. వీటికి అదనంగా అన్నింటిపైనా రూపాయి చొప్పున సేఫ్టీ సెస్సు విధించింది. అలాగే పల్లెవెలుగు బస్సుల్లో ఇప్పటిదాకా రూ.8 ఉన్న కనీస ఛార్జీని రూ.10 పెంచిన ఆర్టీసీ.. రూ.2 డీజిల్ సెస్సు, రూ.1 సేఫ్టీ సెస్సు విధించింది. ఇవన్నీ కలిపితే కనీస టికెట్ ధర రూ.13 అవుతుండగా.. చిల్లర సమస్య రాకుండా అంటూ కనీస ఛార్జీని రూ.15 చేసింది.

ఇదీ చదవండి: RTC: ఆర్టీసీ మనుగడ కోసమే సెస్‌ పెంపు: రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.