Kukkuteswara Swamy Kalyanam In Pithapuram: కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలోని పాదగయ క్షేత్రంలో వేంచేసి ఉన్న రాజ రాజేశ్వరీ సమేత ఉమా కుక్కుటేశ్వరస్వామి కల్యాణ ఉత్సవాలు గురువారం ఉదయం ప్రారంభం అయ్యాయి. స్వామి, అమ్మవార్లకు పంచామృత స్నానం నిర్వహించి, ఉత్సవాలకు అంకుర్పారణ జరిపారు. అనంతరం ధ్వజారోహణ జరిగింది. కుక్కుటేశ్వర స్వామికి లక్ష బిల్వార్చన, రాజ రాజేశ్వరీ దేవికి లక్ష కుంకుమార్చన నిర్వహించారు. గజ వాహనంపై గ్రామోత్సవం జరిగింది. సాయంత్రం కేతేపల్లి శ్యామసుందర్ శర్మ, సోదరుల దంపతులు స్వామిని పెండ్లికు మారుడు, అమ్మవారిని పెండ్లి కుమార్తెను చేశారు. అనంతరం రామకృష్ణ వాసవీ కన్యకా పరమేశ్వరీ కళ్యాణ మండపం వద్ద ఆర్యవైశ్యభక్త బృందం సభ్యులు ఎదురు సన్నాహాలు జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గోని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
రాజ రాజేశ్వరీ సమేత ఉమా కుక్కుటేశ్వరస్వామి కల్యాణం: దక్షిణకాశీగా విరాజిల్లుతున్న పిఠాపురం పట్టణంలోని పాదగయ క్షేత్రంలో వేంచేసి ఉన్న రాజరాజేశ్వరీ సమేత ఉమా కుక్కుటేశ్వరస్వామి కల్యాణం గురువారం రాత్రి కన్నుల పండుగగా జరిగింది. స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు అలంకారం చేసి ప్రత్యేకంగా అలంరించిన కల్యాణ వేదికపై ఆశీనులు గావించారు. ఆస్థాన వేద పండితులు ద్విభాష్యం సుబ్రహ్మణ్య శర్మ ఘనాపాఠి, చెరుకుపల్లి వెంకటేశ్వర్లు బ్రహ్మ మూహుర్తంలో రాత్రి 8.32 గంటలకు కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.
జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు దంపతులు స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు తీసుకువచ్చారు. కళ్యాణ మహోత్సవంలో పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు, ధర్మకర్తల మండలి చైర్మన్ ఆగంటి ప్రభాకరావు, కార్య నిర్వహణ అధికారులు ఆర్. సౌజన్య, వడ్డి శ్రీనివాసరావు, ధర్మ కర్తల మండలి సభ్యులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. కళ్యాణ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. కల్యాణానికి ముందు మహిళలు, చిన్నారులు నిర్వహించిన కోలాటం ఆకట్టుకుంది.
ఇవీ చదవండి
- నవరత్న ఇల్లు.. గ్రామీణ పేద ప్రజలకు నిల్లు!.. ఇంటి నిర్మాణాల కోసం లక్షల మంది ఎదురుచూపులు
- డైట్ ఛార్జీల పెంపుపై "ఉత్తుత్తి మాటలు".. హడావుడితో సరిపెట్టిన ప్రభుత్వం
- హిందూ సంప్రదాయంలోనూ హార్దిక్ మరోసారి పెళ్లి.. ఫోటోలు ఎత బాగున్నాయో!