కాకినాడ జిల్లా అన్నవరం జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థిని మృతి చెందింది. కాకినాడ ప్రగతి ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న నందిని అనే విద్యార్థిని స్వగ్రామం కోటనందురు మండలం కాకరాపల్లి నుంచి స్నేహితురాలితో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తూ రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ దృశ్యాలు సమీపంలోని ఓ దుకాణంలో సీసీ కెమెరాలో నమోదయ్యాయి.
ఇవీ చదవండి