ETV Bharat / state

CBN: నిందితుడు బయటే తిరుగుతున్నా.. పోలీసులకు కనిపించడం లేదా ?: చంద్రబాబు - చంద్రబాబు తాజా వార్తలు

Babu on MLC Driver Case: కారు డ్రైవర్‌ హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్‌ చేయకపోవటంపై తెదేపా అధినేత చంద్రబాబు విస్మయం వ్యక్తం చేశారు. కళ్లముందే నిందితుడు తిరుగుతున్నా.. అరెస్ట్ చేయకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. మృతిడి భార్యను ఫోన్​లో పరామర్శించిన చంద్రబాబు.. అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

చంద్రబాబు
చంద్రబాబు
author img

By

Published : May 22, 2022, 3:43 PM IST

కాకినాడలో హత్యకు గురైన ఎమ్మెల్సీ అనంతబాబు కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం భార్యను తెదేపా అధినేత చంద్రబాబు ఫోన్​లో పరామర్శించారు. సుబ్రహ్మణ్యం కుటుంబానికి అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. గర్భవతిగా ఉన్న సుబ్రహ్మణ్యం భార్య అపర్ణకు పెద్ద కష్టం వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెదేపా తరఫున రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. తన భర్త హత్యపై సీబీఐతో విచారణ జరిపించాలని అపర్ణ కోరుతున్నారన్న చంద్రబాబు.. తెదేపాతో పాటు దళిత సంఘాలు చేసిన పోరాటం వల్లే పోలీసులు సుబ్రహ్మణ్యం మృతిని హత్య కేసుగా నమోదు చేశారన్నారు. హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్టు చేయకపోవటంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. కళ్లముందే నిందితుడు తిరుగుతున్నా.. అరెస్ట్ చెయ్యకపోవడాన్నితప్పుపట్టారు. నిందితుడిని అరెస్టు చేయకుండా పోలీసుల వ్యవహరిస్తున్న తీరు.. బాధితుల అనుమానాలను బలపరిచేలా ఉన్నాయని విమర్శించారు.

ఏం జరిగిందంటే..: సుబ్రహ్మణ్యం.. ఐదేళ్లపాటు ఎమ్మెల్సీ అనంతబాబు దగ్గర డ్రైవర్‌గా పనిచేశారు. ఇటీవల కొంతకాలం క్రితం డ్రైవర్‌ పని మానేసి, ఇంటి దగ్గరే ఉంటున్నారు. గురువారం (మే 19) రాత్రి పదిన్నర గంటలకు స్నేహితులతో కలిసి కాకినాడ కొండయ్యపాలెంలో సుబ్రహ్మణ్యం ఉండగా.. ఎమ్మెల్సీ అనంతబాబు కారులో అక్కడికి వచ్చి సుబ్రహ్మణ్యాన్ని తీసుకెళ్లారు. అర్ధరాత్రి పన్నెండున్నర గంటలకు సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులకు ఎమ్మెల్సీ ఫోన్‌ చేసి.. నాగమల్లితోట దగ్గర ప్రమాదం జరిగిందని చెప్పారు. సుబ్రహ్మణ్యాన్ని ఆసుపత్రికి తీసుకెళ్తున్నానని, అక్కడికి రమ్మని పిలిచారు. మళ్లీ రాత్రి ఒకటిన్నరకు అనంతబాబే తన కారులో సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని వెనుక సీటులో వేసుకుని తీసుకొచ్చారు.

మృతదేహాన్ని తీసుకోవాలని ఎమ్మెల్సీ సూచించగా.. నీరు కారుతూ, ఇసుకతో ఉండటంతో అసలేం జరిగిందని సుబ్రహ్మణ్యం కుటుంబసభ్యులు అడిగారు. బండి ఢీకొట్టిందని ఎమ్మెల్సీ చెప్పడంతో.. తమకు చెప్పాలి గానీ మీరెలా తీసుకొచ్చారని వారు ప్రశ్నించారు. తనతో గొడవ పడొద్దని, శవాన్ని కిందకు దించాలని ఆయన గద్దించారు. శవాన్ని అలాగే ఉంచాలని, కేసు నమోదయ్యాకే దింపుతామని కుటుంబసభ్యులు స్పష్టంచేశారు. వెంటనే దించి జీజీహెచ్​కు తీసుకెళ్లాలంటూ కారులో శవాన్ని ఉంచి తాళం వేసుకుని వెళ్లిపోతుండగా.. సుబ్రహ్మణ్యం కుటుంబసభ్యులు అడ్డుకున్నారు. ఆయన మళ్లీ వచ్చి కారు డోర్‌ తీసి.. తాళం తీసుకుని వెళ్లిపోయారు. మృతదేహాన్ని అపార్టుమెంట్ వద్దకు తేవటం, అనంతబాబు బెదిరించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయని, వాటి ఆధారంగా పోలీసులు తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబసభ్యులు కోరుతున్నారు.

అనంతబాబే చంపేశారు...

ఎమ్మెల్సీ తన పుట్టినరోజని చెప్పి నా భర్తను తీసుకెళ్లారు. ఆయన పుట్టినరోజు నాలుగు నెలల కిందట అయిపోయింది. అనంతబాబు రహస్యాలు, వివాహేతర సంబంధాల గురించి అన్ని విషయాలూ నా భర్తకు తెలుసు. అందుకే చంపేసి శవాన్ని అనంతబాబే కారులో తీసుకొచ్చారు. ఇంతకుముందు ఎప్పడు నా భర్తను భోజనానికి రమ్మని పిలవలేదు, ఎమ్మెల్సీ మా ఇంటికి కూడా రాలేదు. నేను గర్భిణి అనే కారణంతోనే ఆయన దగ్గర నా భర్త డ్రైవర్‌ పని మానేశారు. - అపర్ణ, మృతుడి భార్య

హత్య కేసుగా నమోదు: సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబును ప్రధాన నిందితుడిగా భావిస్తున్నట్లు ఎస్పీ రవీంద్రనాథ్‌ బాబు తెలిపారు. అనుమానాస్పద కేసు నుంచి హత్య కేసుగా మారుస్తున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. కేసు విచారణ నిష్పక్షపాతంగా జరగాలని డీజీపీ ఆదేశించినట్లు ఎస్పీ పేర్కొన్నారు. సుబ్రహ్మణ్యం మృతి కేసులో అనేకమందిని ప్రశ్నిస్తామన్నారు. అనంతబాబుపై సెక్షన్‌ 302, అట్రాసిటీ కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. అనంతబాబును వెంటనే అరెస్ట్‌ చేస్తామని ఎస్పీ రవీంద్రనాథ్‌ బాబు తెలిపారు. ఎమ్మెల్సీ కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై ప్రభుత్వం ఆగ్రహంగా ఉన్నట్లు తెలిపారు. ఎమ్మెల్సీని అరెస్టు చేయడంతో పాటు బాధితుడి కుటుంబానికి న్యాయం చేయాలని ప్రజా సంఘాలు నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే.

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.