ETV Bharat / state

నాలుగున్నరేళ్లుగా మహిళ అభ్యున్నతి గుర్తు రాలేదా జగనన్నా

YSRCP Government Stopped Unnati Scheme: మహిళ సాధికారత కోసం గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన ఉన్నతి పథకాన్ని వైసీపీ ప్రభుత్వం పూర్తిగా పాతరేసింది. గత నాలుగు సంవత్సరాలుగా మహిళ అభ్యున్నతిని తుంగలో తొక్కిన వైసీపీ.. నేడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆటోలు పంపిణీ అంటూ నానా హైరానా చేస్తోంది.

ysrcp_government_stopped_unnati_scheme
ysrcp_government_stopped_unnati_scheme
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 3, 2023, 7:38 AM IST

నాలుగున్నారేళ్లుగా మహిళ అభ్యున్నతి గుర్తు రాలేదా జగనన్నా

YSRCP Government Stopped Unnati Scheme: మహిళల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నామంటూ గొప్పలు చెపుకుంటున్న వైసీపీ ప్రభుత్వం.. ఆ దిశగా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయడం లేదు. అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్లుగా ఎస్సీ, ఎస్టీ మహిళలకు రిక్తహస్తమే చూపింది. ఎన్నికలు దగ్గరికొస్తున్న ఈ సమయంలో.. వారిని మభ్యపెట్టేందేకు పావులు కదుపుతోంది. ఆటోల పంపిణీతో మహిళలను మాయచేయాలని చూస్తోంది.

ఉన్నతి అనే పథకం డ్వాక్రా సంఘాల్లోని ఎస్సీ, ఎస్టీ మహిళల అభ్యున్నతికి సంబంధించి ఉద్దేశించిన పథకం. దీని ద్వారా రుణాలు తీసుకున్న మహిళలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ సుస్థిర అభివృద్ధి సాధించేలా చూడాలనేది లక్ష్యం. ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభమైన ఈ పథకం ఉద్దేశం బాగుండటంతో.. తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు కొనసాగించారు. సంక్షేమమే పరమావధిగా చెప్పుకొంటున్న జగన్‌ ప్రభుత్వం మాత్రం దానికి పాతరేసింది.

Zero Interest Loans For DWACRA Women: డ్వాక్రా మహిళల సున్నావడ్డీకి 'సున్నం'కొట్టిన సీఎం.. చెప్పేదేంటి చేసేదేంటి జగనన్నా..!

ఉపాధి కల్పనకు ప్రభుత్వం మొండిచేయి: ఆర్థికంగా వెనుకబడిన డ్వాక్రా మహిళల సుస్థిర ఉపాధి కల్పనకు నిధులివ్వడానికి ప్రభుత్వానికి చేతులే రావడం లేదు. వైసీపీ సభలకు బలవంతంగా తరలించడానికి చూపుతున్న చొరవను.. వారి కాళ్లపై సొంతంగా నిల్చునేలా చేతి నిండా పని కల్పించేందుకు మాత్రం చూపడంలేదు.

AP Dwakra Schemes for Women Autos: ఎన్నికల కోసం ఆటోలంటూ కొత్త ఎత్తుగడ: ఇదే పథకానికి 2014-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో దాదాపు 800 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్‌.. నాలుగున్నరేళ్లలో ఒక్క రూపాయి కేటాయించలేదు. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతుండటంతో.. ప్రచారం చేసుకోడానికి ఏదో ఒకటి చేసేసినట్లు కనిపించడానికి.. గత ప్రభుత్వాలిచ్చిన నిధులతోనే మహిళలకు ఆటోలు కొనడానికి కసరత్తు చేస్తున్నారు. దాన్ని తన ఖాతాలో వేసుకునేందుకూ సిద్ధమవుతున్నారు.

భావితరాల కోసం కలగన్నారు.. సంఘటితమై సాధించారు

Unnati Scheme: ఉన్నతి పథకం మహిళల కోసం ఎలా: ఉన్నతి పథకం కింద డ్వాక్రా సంఘాల్లోని ఎస్సీ, ఎస్టీ మహిళలకు ఒక్కొక్కరికి 20 వేల నుంచి 50 వేల రూపాయల వరకు సున్నా వడ్డీకి రుణాలివ్వాలి. వారు నెలవారీ వాయిదాల్లో చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇతరులకివ్వాలి. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ పథకం ద్వారా సుస్థిర ఉపాధి ఏర్పాటు చేసుకున్న ఎస్సీ, ఎస్టీ మహిళలు చాలా మందే ఉన్నారు. ఈ ఫలితాలను గ్రహించిన నాటి ప్రభుత్వం.. ఈ ఉపాధి అవకాశాలు మరింత మందికి చేరువ చేసేందుకు ఏటా ప్రతి బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులను కేటాయించింది.

జగన్‌ అధికారంలోకి రాకముందు వరకు ఇదే జరిగింది. ఆయన ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తర్వాత.. ఉప ప్రణాళిక కింద వేల కోట్ల రూపాయలు కేటాయించినట్లు అంకెలు చూపిస్తున్నారు. అందులో మహిళల ఉపాధికి సంబంధించిన ‘ఉన్నతి’ కి మాత్రం ఒక్క రూపాయి ఉండదు. బడ్జెట్‌ సందర్భంగా అధికారులు ఏటా నిధుల కోసం ప్రభుత్వానికి నివేదించడం, జగన్‌ వారికి మొండిచేయి చూపడం రివాజుగా మారింది.

'నేను ఉండాలా వద్దా?మహిళలే తేల్చుతారు, వైకాపా నాయకులు కాదు'

Autos Distribution for Womens in AP: అందుబాటులో ఉన్న నిధులనే సర్దుబాటు: 2023-24 బడ్జెట్‌లోనూ ఎస్సీలకు 100 కోట్లు, ఎస్టీలకు 50 కోట్ల రూపాయలు కేటాయించాలని అధికారులు ప్రభుత్వానికి నివేదించినా పట్టింపేలేదు. దీంతో చేసేదేమీ లేక అధికారులు అందుబాటులో ఉన్న నిధులనే గత నాలుగున్నరేళ్లుగా సరిపెడుతున్నారు. ఎన్నికల సమయం కావడంతో పాత పద్దుకు సంబంధించిన దాదాపు 7 కోట్ల రూపాయలు వెచ్చించి రాష్ట్రవ్యాప్తంగా 230 మంది ఎస్సీ, ఎస్టీ మహిళలకు ఆటోలను కొనుగోలు చేయించే పనిలో ఉన్నారు. త్వరలో వీటిని సీఎం చేతుల మీదుగా పంపిణీ చేసేందుకు సమాయత్తమవుతున్నట్టు సమాచారం.

తెలుగుదేశం ప్రభుత్వం, అంతకుముందు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఈ పథకానికి మంజూరు చేసిన కేటాయింపులను కలిపితే దాదాపు 13 వందల కోట్ల రూపాయల వరకు లబ్ధిదారుల దగ్గర నిల్వ ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో 250 కోట్లు మొండి బకాయిలుగా మారాయి. మిగతా మొత్తం నుంచి నెలవారీ వాయిదాల రూపంలో వచ్చిన దాన్ని ఎప్పటికప్పుడు ఇతర లబ్ధిదారులకు రుణంగా సర్దుబాటు చేస్తున్నారు.

గత 4 సంవత్సరాలుగా నిధులు కేటాయిస్తే మేలు జరిగేది: 2020-21 ఏడాదిలో 216 కోట్ల రూపాయలు, 2021-22లో 100 కోట్ల రూపాయలు, 2022-23లో 280 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసినట్లు తెలిసింది. ఈ ఏడాది ఇప్పటివరకు 60 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. ఇంత పెద్దమొత్తంలో ఖర్చు చేస్తున్నారంటే.. ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకునేందుకు ఎస్సీ, ఎస్టీ మహిళలు ఎంతగా ఎదురు చూస్తున్నారో గమనించవచ్చు. నాలుగున్నరేళ్లలో జగన్‌ కూడా నిధులు కేటాయించి ఉంటే మరికొంత మందికి మేలు జరిగేదే కదా. కానీ ఇవేమీ ప్రభుత్వానికి పట్టడం లేదు.

సీఎం సభలకు వస్తారా? చస్తారా?-డ్వాక్రా మహిళలకు వైసీపీ నేతల హూకుం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.