YSRCP Government Negligence in Nadu Nedu Works: నాడు-నేడు పనులతో బడుల రూపురేఖలు మార్చేశామని గొప్పలు చెబుతున్న ముఖ్యమంత్రి జగన్‌కి(AP CM Jagan Mohan Reddy).. ఇప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే.. ఆ డొల్లతనమేంటో తెలుస్తుంది. మొదటి విడత పనులు పూర్తి చేసి, రెండు సంవత్సరాలు గడవక ముందే.. పాఠశాలల్లో సమస్యలు పునరావృతమవుతున్నాయి. చాలా బడుల్లో టైల్స్‌తో వేసిన ఫ్లోరింగ్ కుంగిపోయింది. ఏడు సంవత్సరాల పాటు ఉంటాయని వేసిన రంగులు వెలిసిపోయాయి. ఆర్వో ప్లాంట్లు పనిచేయడం లేదు. మరమ్మతులు చేసిన శ్లాబు పెచ్చులు ఊడిపోతున్నాయి. కొన్ని చోట్ల మరుగుదొడ్ల పనులు పూర్తి చేయకపోవడం.., నీటి సదుపాయం లేకపోవడంతో... నిరుపయోగంగా మారాయి.
Negligence in Nadu Nedu Works in AP: పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పచ్చటి లాన్ కనుమరుగైపోయింది. గత సంవత్సరం 852 కోట్ల 39 లక్షలు, ఈ ఏడాది 879 కోట్ల 28 లక్షల రూపాయలను.. అమ్మఒడి లబ్ధిదారుల నుంచి వెనక్కి తీసుకున్నారు. కేవలం ఆయాలు, నైట్ వాచ్‌మెన్‌ల జీతాలు, మరుగుదొడ్ల క్లీనింగ్‌కు రసాయనాల సరఫరాకు మాత్రమే ఈ నిధులు వినియోగిస్తున్నారు. నల్లాలు చెడిపోయినా.. రన్నింగ్ వాటర్ సమస్య వచ్చినా.. ఫ్లోరింగ్ కుంగిపోయినా.., టైల్స్ పగిలినా పట్టించుకోవడం లేదు. పాఠశాలల నిర్వహణకు ప్రత్యేకంగా నిధులు ఇవ్వకపోవడంతో ఉపాధ్యాయులు ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడతలో 15 వేల 715 పాఠశాలల్లో 3 వేల 669 కోట్ల రూపాయలతో పనులు పూర్తిచేశారు. 2019 నవంబర్ 14న ప్రారంభమై పనులు 2021 ఆగస్టు 16 నాటికి పూర్తయ్యాయి.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం నందంపూడి ఎంపీపీ పాఠశాలలో టైల్స్‌తో వేసిన ఫ్లోరింగ్ కుంగిపోయింది. మరుగుదొడ్లకు వేసిన తలుపులు ఊడిపోయాయి. గోడలపై వేసిన చిత్రాల రంగులు వెలిసిపోయాయి. ఈ రంగులపై మరోసారి కొత్తగా వేసిన రంగులూ వెలిసిపోయాయి. హైస్పీడ్‌తో తిరుగుతాయని ఏర్పాటు చేసిన ఫ్యాన్లు సక్రమంగా తిరగడం లేదు. పి.గన్నవరం మండలం లంకల గన్నవరం ప్రాథమిక పాఠశాల భవనాన్ని.. నాడు-నేడు పనుల పేరుతో గత ఏడాది తొలగించారు.
YCP Leaders Irregularities in Nadu Nedu: కొత్త భవనం నిర్మించేందుకు గత ఏడాది సెప్టెంబర్‌లో 53 లక్షల రూపాయలు కేటాయించాలని నిర్ణయించారు. ఇప్పటివరకూ కేవలం 13 లక్షల 50 వేలు మాత్రమే మంజూరు చేయడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. పాఠశాల భవనం తొలగించడంతో.. ఇక్కడి 44 మంది విద్యార్థులను స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన చిన్నపాటి షెడ్డులోనే పాఠశాలను నడుపుతున్నారు. త్వరగా పాఠశాల నిర్మాణం పూర్తిచేయాలని కోరుతున్నారు.
గన్నవరం నియోజకవర్గంలోని అరుంధతిపేట, ఎల్లమెల్లివారిపేట, కారుపల్లిపాడు పాఠశాలల పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఈ పాఠశాలలకు చెందిన 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలలో విలీనం చేయడంతో.. ఒక్కో బడిలో ఇద్దరు, ముగ్గురు చొప్పునే విద్యార్థులు మిగిలారు. వారితోనే ఉపాధ్యాయులు నెట్టుకొస్తున్నారు.
Nadu-Nedu: 'వైసీపీ ప్రభుత్వ ప్రచారాల కోసమే నాడు-నేడు'.. పాఠశాలలు ప్రారంభమైనా.. పూర్తికాని పనులు
Nadu Nedu Works Slowly in Alluri District: అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం మెరకచించ పంచాయతీ దిగ-గసరాపల్లిలో 35 ఏళ్ల కిందట నిర్మించిన గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరింది. 15 ఏళ్ల కిందట మరో భవనం శ్లాబ్ స్థాయికి నిర్మించారు. బయట, లోపల బ్లాక్ బోర్డులు నిర్మించారు. గచ్చులు, కిటికీలు, రంగులు మరిచారు. దీంతో పాఠశాల భవనం కాస్తా పశువుల పాకగా మారింది. ప్రహరీ పనులు మధ్యలో నిలిచిపోయాయి. పెద్ద గేటు వృథాగా పడి ఉంది. లక్షలాది రూపాయలు నాడు-నేడు పనుల్లో వెచ్చించే బదులు.. ఈ అసంపూర్తి నిర్మాణాలను పూర్తి చేస్తే బాగుంటుందని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
Students fire on NADU-NEDU: ప్రారంభమైన సర్కారీ బడులు..నత్తనడకన నాడు-నేడు పనులు..
మెరకచింత పంచాయతీకే చెందిన రంగసింగపాడు ప్రజలు 2016లో.. చందాలు వేసుకుని.. శ్రమదానంతో చిన్న రేకుల షెడ్డు నిర్మించుకుని.. అందులోనే పాఠశాలను నడుపుతున్నారు. 2018లో ఓ కాంట్రాక్టర్ పాఠశాల భవనం నిర్మాణ పనులు ప్రారంభించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక బిల్లులు రాకపోవడంతో మధ్యలోనే పనులు ఆపేశారు. దీంతో విద్యార్థులకు పాఠశాల లేకుండా పోయింది. వర్షం వస్తే పిల్లలు కూర్చోవడానికి సరైన జాగా కూడా లేదు.
ఇదే పంచాయతీకి చెందిన కరకపట్టులోని ప్రాథమిక పాఠశాల పూరిపాకలో నడిచేది. హుద్‌హుద్ తుపాను వల్ల పాక ఎగిరిపోయింది. ఐదేళ్ల కిందట మరో షెడ్డు నిర్మాణం మొదలై.. పిల్లర్ల స్థాయిలో ఆగిపోయింది. నాడు-నేడు కింద పనులు ప్రారంభం కాగా.. మందకొడిగా సాగి.. రెండు నెలల కిందట నిలిచిపోయాయి. పాఠశాలలో బెంచీలు కనిపిస్తున్నాయి కానీ.. భవనం రంగులు, కిటికీలు లేకుండా బోసిగా ఉంది. వెంటనే నిర్మాణం పూర్తిచేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Nadu Nedu: పేరు గొప్ప ఊరు దిబ్బ.. నత్తనడకన నాడు నేడు రెండో దశ నిర్మాణ పనులు
Nadu Nedu Works in Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలోని పెదకాపువీధి ఉన్నత పాఠశాల మరమ్మతుల కోసం మొదటి విడతలో 73 లక్షల నిధులు మంజూరయ్యాయి. అయినా... మరుగుదొడ్లలో బేసిన్లు, ఇతర సామగ్రి అమర్చకుండానే వదిలేశారు. పాత మరుగుదొడ్లకు నీటి సదుపాయం లేకుండా చేశారు. ఫలితంగా ఈ పాఠశాలలో ఉన్న 550 మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
ఎన్టీఆర్ జిల్లా కంకిపాడులోని ఉన్నత పాఠశాలలో నాడు-నేడు పనుల ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఉన్నాయి. ఆగి ఉన్న పనుల వల్ల పాఠశాల ప్రాంగణమంతా అస్తవ్యస్తంగా మారింది. మరుగుదొడ్ల మరమ్మతులు, ప్రహరీ, నీళ్ల ట్యాంక్ పనుల్లో కదలిక లేదు.
Nadu-Nedu Scheme: పడకేసిన నాడు నేడు అభివృద్ధి పనులు
రాష్ట్రవ్యాప్తంగానూ అనేక చోట్ల పాఠశాలల్లో ఓవర్ హెడ్ ట్యాంకుకు కుళాయిలు అమర్చకుండానే వదిలేశారు. చాలా బడుల్లో టైల్స్ దెబ్బతిన్నాయి. మరుగుదొడ్లు అసంపూర్తిగా వదిలేశారు. గోడలు బీటలు వారాయి. బెంచీలు విరిగిపోయాయి. తాగునీటి కోసం ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్లు పనికిరాకుండా పోయాయి. పాఠశాల పైకప్పులు కూలి విద్యార్థులకు గాయాలయ్యాయి. అనేక చోట్ల.. ప్రధానోపాధ్యాయుడు, తల్లిదండ్రుల కమిటీ పర్యవేక్షణలో జరగాల్సిన పనులను వైసీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు చేసేశారు. ఎంతోకొంత మిగుల్చుకోవాలనే ఉద్దేశంతో నాసిరకంగా పనులు కానిచ్చేశారు.
APEWIDC: ఏపీ విద్య, సంక్షేమ మౌలిక సదుపాయాల కల్పన సంస్థ-APEWIDC.. టెండర్లలోనూ నిబంధనలు ఉల్లంఘించింది. లక్షన్నర డ్యూయల్ డెస్క్‌ల సరఫరాకు మొదట ఒప్పందం కుదుర్చుకుని... ఆ తర్వాత 2 లక్షల 49 వేలు తీసుకుంది. నిబంధనల ప్రకారం టెండర్లలో పేర్కొన్న సంఖ్య కంటే 25 శాతం వరకు అదనంగా తీసుకోవచ్చు. అంతకు మించితే కొత్త టెండరుకు వెళ్లాలి. సమయం లేదనుకుంటే టెండర్లు వేసిన కంపెనీల్లో ఎవరైతే తక్కువ ధరకు సరఫరాకు ముందుకు వస్తారో.. వారికైనా అప్పగించాలి.
బోర్డు మార్చినంత సులువు కాదు.. మోడల్ స్కూలు అంటే..!
అయితే APEWIDC.. ఈ నిబంధనలనే పట్టించుకోలేదు. గ్రీన్ చాక్‌పీస్ బోర్డు టెండర్లలో L-1 గా నిలిచిన వ్యక్తి 15 వేలు సరఫరా చేయగా.. ఒప్పంద గడువు ముగిసిన తర్వాత L-2 వద్ద నుంచి 20 వేలు తీసుకున్నారు. ఫ్యాన్ల కంపెనీకి 5 కోట్ల రూపాయల జరిమానా వేసినా.. వసూలు చేయలేదు. దీనికి బాధ్యులైన వారిపైనా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మొదట లక్షా 55 వేల ఫ్యాన్ల కొనుగోలు ఒప్పందం చేసుకుని.. 3 లక్షల 14 వేలు తీసుకున్నారు.
'నాడు-నేడు'కు బిల్లుల చెల్లింపు గ్రహణం.. 25శాతం కూడా దాటని పాఠశాలల ఆధునీకరణ