YSRCP Government Neglected Best Available School Scheme : గత ఇరవై సంవత్సరాలకు పైగా దళిత బిడ్డలకు.. విద్యను అందించిన బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకానికి వైసీపీ ప్రభుత్వం చరమగీతం పాడింది. ఆ పథకం ఇప్పటి వరకు ఎంతో మంది పేద విద్యార్థులను ఉన్నాతాధికారులుగా, వారిని మహోన్నత స్థాయికి తీసుకెళ్లింది. పేదలకు తోడ్పాటును అందించిన ఈ పథకాన్ని.. సీఎం జగన్ ఒక్క సంతకంతో నిలిపివేశారు.
'మట్టినుంచి గట్టిగా పెరిగిన ఈ మొక్కలు.. మహావృక్షాలై ప్రపంచానికే ఫలాలు అందిచాలని కోరుకుంటున్నాను. పేద పిల్లలు ఏ ఒక్కరు కూడా పేదరికం వల్ల చదువులకు దూరం కాకుడదని.. మన ప్రభుత్వం గట్టిగా నిర్ణయించింది. మన పిల్లలందరూ అన్ని రంగాలలో ఎదగాలి. నాయకత్వ లక్షణాలు పెంచే విధంగా మన చదువులన్నీ ఉండాలి. మణిక్యాలన్ని మట్టిలోనే పుడతాయి.' అని జూన్ 20, 2023న ఇంటర్, పదోతరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన ప్రభుత్వ విద్యాలయాల విద్యార్థుల్ని సత్కరించేందుకు ఏర్పాటు చేసిన 'ఆణిముత్యాలు' కార్యక్రమంలో సీఎం జగన్ ఇలా అన్నారు.
క్షేత్రస్థాయిలో జగన్ మాటలకు విరుద్ధంగా: ఈ మాటలు వింటే పేద పిల్లల విద్య కోసం జగన్ ఎంతగా తపిస్తున్నారో అనుకుంటున్నారా. వారి ఉన్నతికి ఎంత అకుంఠిత దీక్ష కనబరుస్తున్నారోనని ఆలోచిస్తున్నారా. ఇక బయటపడేది వజ్రాలేనని భావిస్తున్నారా. అయితే ఒక్కసారి ఈ విద్యార్థి సంఘం నాయకుడు క్షేత్రస్థాయి పరిస్థితిపై వ్యక్తం చేస్తున్న ఆవేదననూ ఒక్కసారి చదవండి.
"చాలా మంది దళిత బిడ్డలు ఐఏఎస్ సాధించటానికి బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం సహాయపడింది. గతంలో ఉన్న పథకాలను తొలగించటం సరైంది కాదు. సీఎం జగన్ అధికారంలోకి రాకముందు ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అని చెప్పారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం ద్వారా ఎంతో మంది విద్యార్థులు పల్లెల నుంచి పట్టణాలకు వచ్చారు. ఉన్నత కోర్సులను అభ్యసించారు. ఇప్పుడు ఇలాంటి పథకం అందుబాటులో లేకపోవటంతో.. డ్రాప్ అవుట్స్ సంఖ్య ఈ మధ్య కాలంలో పెరిగింది." -అశోక్, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి
Education Syllabus Changes in AP: 'ఇదేంటి జగన్ మామా..?' పాఠశాల సిలబస్ మార్పుపై విద్యార్థుల్లో అయోమయం
నాణేనికి వెనక వైపు దాగున్న అసలు నిజం : ముఖ్యమంత్రి జగన్ సభల్లో చెప్పే మాటలన్నీ.. నాణేనికి ఒకవైపు మాత్రమే అనే విషయం విద్యార్థి సంఘం నాయకుడి మాటల వల్ల ఇట్టే అర్థమవుతుంది. అమ్మఒడి, విద్యాదీవెన, విద్యావసతి వంటి పిల్లలతో మమేకమయ్యే ఏ కార్యక్రమంలోనైనా ఆయన మాటలు ఇలానే చాలా బాగుంటాయి.
సామాజిక అస్పశ్యతను తొలగించి విద్యాభివృద్ధికి పాటుపడిన కందుకూరి వీరేశలింగం పంతులు వలె.. అట్టడుగు వర్గాల విద్యా కోసం తాను శ్రమిస్తున్నట్లు మాట్లాడతారు. కానీ నాణేనికి రెండో వైపు ఇంకోలా ఉంది. నా ఎస్సీ, నా ఎస్టీ అంటూ గంభీరంగా చెబుతూనే.. వారికి మంచి విద్య అందే అవకాశాల్ని కాలదన్నుతున్నారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ బీఎస్ పథకమే అందుకు నిలువెత్తు నిదర్శనం.
Prathidwani పాఠశాల విద్య వ్యవస్థతో జగన్ సర్కారు చెలగాటం..!
రెండు దశాబ్దాలకుపైగా బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం కింద.. దళిత, గిరిజన బిడ్డలకు అందుతున్న ప్రోత్సాహానికి జగన్ అధికారం చేపట్టగానే పాతరేశారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 2020లో మెమో ద్వారా పథకాన్ని నిలిపేస్తున్నట్లు ఆదేశిస్తూ.. తన ప్రభుత్వ కలం పోటును ఎస్సీ, ఎస్టీ బిడ్డలపైనే వేశారు. 1995లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన పథకాన్ని జగన్ అధికారంలోకి వచ్చి నిలిపేశారు.
తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొచ్చిందనే కక్షతోనే ఎస్సీ, ఎస్టీలకు మేలు చేసే మంచి పథకాన్ని నిర్వీర్యం చేశారు. ఈ పథకం కింద ప్రభుత్వమే ప్రతిభావంతులైన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను గుర్తించి జిల్లాల వారీగా బాగా పేరున్న కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలకు ఎంపిక చేసి వాటిలో చదివించేది.
Education Migrants: ఉన్నత విద్యను గాలికొదిలేసిన ప్రభుత్వం.. పైచదువుల కోసం పొరుగురాష్ట్రాల బాటలో..
విద్యార్థులు కోరుకున్న పాఠశాల్లో చదివే అవకాశం ఉండేది. ఇలా 1 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు ఈ పథకాన్ని అమలు చేశారు. ఎస్సీ విద్యార్థులను 1, 5 తరగతుల్లో.., ఎస్టీ విద్యార్థులను 3, 5, 8 తరగతుల్లో ఎంపిక చేసేవారు. డే స్కాలర్స్‌గాగానీ, రెసిడెన్షియల్‌గాగానీ విద్యార్థులు ఏది కోరుకుంటే ఆ సౌకర్యాన్ని ప్రభుత్వాలు సమకూర్చాయి. మొదట్లో ఒక్కో విద్యార్థిపై 2 వేల నుంచి 3 వేల రూపాయల వరకు ప్రభుత్వం ఖర్చు చేసేది. జగన్ అధికారంలోకి రాక ముందు వరకు ఈ పథకం కింద లక్షల మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఆదరువు లభించింది.
"ఏదో కొత్తగా చూపించాలని.. గత ప్రభుత్వాలు తీసుకొచ్చిన పథకాలకు చరమగీతం పాడారు. పేదలు కార్పోరేట్ పాఠశాలల్లో చదువుకునే అవకాశమున్న ఈ పథకాన్ని తొలగించారు. ఇలాంటి పథకాలను కొనసాగిస్తేనే సీఎం జగన్కు మనుగడ ఉంటుంది." -నటరాజ్, కేవీపీఎస్ అధ్యక్షుడు ఎన్టీఆర్ జిల్లా
"బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం ఈరోజు తీసుకు వచ్చింది కాదు. గత అనేక దశాబ్దాల క్రితం నుంచి ఈ పథకం ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాగనే ఈ పథకానికి పాతరేసింది. ఈ పథకాన్ని తొలగించి కార్పోరేట్ విద్యను పేద విద్యార్థులకు దూరం చేసింది." -కె.సి.పెంచలయ్య, రాష్ట్ర అధ్యక్షుడు యానాదుల సంక్షేమ సంఘం
ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత విద్య..వారికి మాత్రమే
ఒక్కో జిల్లాలో 800మంది విద్యార్థులకు సాయం: పథకం ప్రారంభించి ఏళ్లు గడుస్తున్న కొద్దీ ప్రభుత్వాలు ఇచ్చే ఆర్థిక సాయమూ పెరిగింది. 2014లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపట్టాక ఈ పథకాన్ని మరింత మిన్నగా అమలు చేసింది. ఉమ్మడి జిల్లాల పరంగా ఒక్కో జిల్లాకు 800 మందికిపైగా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను, వారు కోరుకున్న కార్పొరేటు బడుల్లో చదువుకునే అవకాశం కల్పించింది.
ఇలా ఏటా ఆయా తరగతులకు 10 వేల మందికిపైగా పిల్లల్ని ఎంపిక చేసి చదివించింది. వసతి సౌకర్యాన్ని కోరుకుంటే 30 వేలు, డేస్కాలర్స్ అయితే 20 వేల రూపాయల చొప్పున ఒక్కో విద్యార్థి తరఫున ప్రైవేటు బడులకు ప్రభుత్వమే చెల్లించింది. మొత్తం మీద అప్పట్లో అన్ని తరగతులకు కలిపి ఏకకాలంలో ఏటా 50 వేల మంది పిల్లలు ఆయా తరగతుల్లో విద్యను అభ్యసించేవారు.
ప్రధాన ఉపాధ్యాయుడి ఆలోచన.. ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ స్థాయిలో విద్య
ఇలా విద్యను అభ్యసించటానికి అప్పటి ప్రభుత్వం ఏటా 100 కోట్ల రూపాయలు వెచ్చించింది. 2019లో తిరిగి అధికారంలోకి వస్తే ఒక్కో విద్యార్థిపై వెచ్చించే ఖర్చును 45 వేల రూపాయలకు పెంచాలనే ప్రతిపాదన కూడా అప్పట్లో తెలుగుదేశం చేసింది.
జగన్ ప్రభుత్వం 2020లో ఈ పథకాన్ని నిలిపేయాలని మెమో జారీ చేసే నాటికి రాష్ట్రవ్యాప్తంగా 42 వేల మంది విద్యార్థులు వివిధ తరగతుల్లో చదువుతున్నారు. అప్పటివరకు అమలవుతున్న పథకాన్ని అర్ధాంతరంగా నిలిపేస్తే ఆ పేద పిల్ల పరిస్థితి ఏంటనీ కూడా ఆలోచించలేదు. ఎలా పోతే ఏమనుకున్నారో ఏమోగానీ నిర్ణయం తీసుకున్నదే తడవుగా మెమో ఇచ్చేశారు.
విదేశీ విద్య ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎక్కడ..? - కోవెలమూడి
కోర్టులకు వెళ్లి నిధులు విడుదల: మెమో విడుదలపై ఎస్సీ, ఎస్టీ సంఘాలు కోర్టు మెట్లు ఎక్కి పోరాటం చేస్తే ఆ మెమో రద్దైంది. అయినా జగన్ తగ్గలేదు. పంతం పట్టి ఈ సారి మరింత పగడ్బందీగా ప్రభుత్వం జీవోను తెచ్చింది. దీనిపై సంఘాలు మళ్లీ కోర్టుకు వెళితే ఆయా పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్ని పదో తరగతి పూర్తి అయ్యే వరకు కొనసాగించాలని తీర్పు ఇచ్చింది. కొత్త విద్యార్థుల ఎంపిక ఆగిపోయింది.
అప్పటికే ఎంపికైన విద్యార్థులు కొనసాగుతున్నారు. అలాగని వారికి కట్టాల్సిన మొత్తాన్ని ప్రభుత్వం చెల్లిస్తోందా.. అంటే అదీలేదు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు కోర్టుకు వెళ్లి నిధులు విడుదల చేయించుకోవాల్సిన పరిస్థితి. 2020-21 నుంచి ఇప్పటి వరకు చాలా పాఠశాలల యాజమాన్యాలకు బకాయిలు చెల్లించడం లేదు. శ్రీకాకుళం జిల్లాలోని ఓ ప్రైవేటు పాఠశాలకు 50 లక్షల రూపాయల వరకు బకాయి పెట్టింది.
కోర్టు తీర్పు ప్రకారం కొన్ని ప్రాంతాల్లో అమలు : శ్రీకాళహస్తి, పాతపట్నం, నంద్యాల, మైలవరం, కర్నూలు సహా పలు ప్రాంతాల్లో ఇప్పటికే కొన్ని పాఠశాలలు కోర్టు తీర్పు మేరకు ఈ పథకం కింద విద్యార్థులకు విద్యను అందిస్తూనే ఉన్నాయి. ప్రభుత్వం మాత్రం కోర్టు తీర్పును పాటించడం లేదని పాఠశాలల యాజమాన్యాలు మండిపడుతున్నాయి.