ETV Bharat / state

పోలీసు వాహనాలకు వైకాపా రంగులు! - గుంటూరులో పోలీసు వాహనాలకు వైకాపా రంగులు న్యూస్ అప్​డేట్స్

పోలీసు వాహనాలకు వైకాపా రంగులు వేయడంపై వివాదం నడుస్తోంది. ప్రభుత్వ వాహనాలకు పార్టీ రంగులు వేయడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నాయి.

పోలీసు వాహనాలకు వైకాపా రంగులు!
పోలీసు వాహనాలకు వైకాపా రంగులు!
author img

By

Published : Dec 21, 2020, 2:51 PM IST

Updated : Dec 21, 2020, 7:47 PM IST

పోలీసు వాహనాలకు వైకాపా రంగులు

ప్రభుత్వ వాహనాలకు వైకాపా రంగులు వేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు పార్టీ రంగులు ప్రభుత్వ వాహనాలకు వేయడమేంటని పలువురు ప్రశ్నలు గుప్పిస్తున్నారు. కొన్ని రోజులైతే.. పోలీసు యూనిఫామ్​కు కూడా పార్టీ రంగులు మారుస్తారని.. అధికార పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఏమైందంటే..

గుంటూరులో షీ టీమ్​లలో పనిచేసే మహిళా పోలీసుల కోసం ద్విచక్రవాహనాలను సమకూర్చారు. అయితే ఈ వాహనాలకు వైకాపా రంగులు వేశారు. వీటిని గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి మహిళా పోలీసులకు అందించారు. వీటిలో ఎక్కువ వాహనాలు పాతవే ఉన్నాయి. వాటికే అధికార పార్టీ రంగులు వేసి పంపిణీ చేయడం ఇప్పుడు విమర్శలకు దారి తీసింది.

త్వరలో యూనిఫామ్​ కూడానా

పోలీసు వాహనాలకు వైకాపా రంగులపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఘాటుగా విమర్శించారు. కొంతమంది పోలీస్ అధికారుల అత్యుత్సాహం చూస్తుంటే.. త్వరలో యూనిఫామ్ కూడా వైకాపా రంగులోకి మార్చేసేలా ఉన్నారని ఎద్దేవా చేశారు. ఫ్యాక్ట్ చెక్ పేరుతో అవి వైకాపా రంగులు కాదు.. శాంతికి చిహ్నాలు అంటూ సమయం వృథా చెయ్యకుండా మహిళలకు భద్రత కల్పించడంపై పోలీసులు దృష్టి పెడితే మంచిదని హితవు పలికారు.

ప్రభుత్వ వాహనాలకు పార్టీ రంగులా

ప్రభుత్వ వాహనాలకు వైకాపా రంగులు వేయడం సిగ్గుచేటని తెదేపా నేత నిమ్మకాయల చినరాజప్ప విమర్శించారు. పాత వాహనాలకు పార్టీ రంగులు వేసి షీ టీమ్ లకు స్వయంగా అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి అందజేయడం.. అధికార పార్టీకీ పోలీసులు తొత్తులుగా వ్యవహరించడమేంటని దుయ్యబట్టారు. సీఎం జగన్ పుట్టినరోజు నాడే ఆ వాహనాలను అందించి అత్యుత్సాహం ప్రదర్శించారన్నారు. పార్టీలకు అతీతంగా ప్రభుత్వ అధికారులు విధులు నిర్వర్తించాలని సూచించారు.

రంగుల్లో కాదు ర్యాంకుల్లో ముందుండాలి

ముఖ్యమంత్రి జగన్మోహన్​రెడ్డికి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ట్విట్టర్​లో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఈ సందర్భంగా రంగుల్లో కాకుండా ఏపీని ర్యాంకుల్లో ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నానని వ్యాఖ్యానించారు. పోస్ట్​కు సీఎం జగన్ ఏపీకి వైకాపా రంగులు వేస్తున్న కార్టూన్​ను షేర్ చేశారు.

ఇదీ చదవండి: రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర భూసర్వే ప్రారంభం

Last Updated : Dec 21, 2020, 7:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.