గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని ఎమ్మెల్యే విడదల రజిని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా నియోజకవర్గంలో 4,821 డ్వాక్రా గ్రూపులకు రూ.4.50 కోట్లు జమ కాబోతున్నాయని తెలిపారు. ఇంత పెద్ద మొత్తం నిధులు గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు. ఆడపడుచులు బ్యాంకులకు చెల్లించాల్సిన రుణాల్లో ఇకపై వడ్డీ మినహాయింపు ఉంటుందని చెప్పారు. ప్రజలకు అండగా ఉంటున్న సీఎం వైఎస్ జగన్మోహాన్రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఇదీ చూడండి: 'ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నా...ఆదుకుంటున్నాం'