గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలోని వైకాపా కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ వేడుకలు జరిగాయి. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పార్టీ జెండాను ఆవిష్కరించారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్చేసి సంబరాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పదేళ్ల క్రితం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పార్టీ ఆవిర్భవించిందన్నారు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని జగన్ అధికారంలోకి వచ్చారని పేర్కొన్నారు. పాదయాత్రలో ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా చూసి..అధికారంలోకి రాగానే సీఎం.. అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని చెప్పారు.
ఇదీ చదవండి: పింగళి వెంకయ్య కుమార్తెకు సీఎం జగన్ సన్మానం