కర్ఫ్యూ సమయంలో అనవసరంగా రోడ్లపైకి వచ్చిన యువతను.. గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లాలో కర్ఫ్యూ అమలవుతున్న తీరును గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి పరిశీలించారు. నగరంలోని విద్యానగర్, లాడ్జి సెంటర్, నగరంపాలెం ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఈ తరుణంలో.. కొంతమంది యువత అనవసరంగా రోడ్లపైకి రావటాన్ని గమనించి వారిని అరెస్టు చేశారు. ప్రాణాలను పణంగా పెట్టి.. పోలీస్ వ్యవస్థ రాత్రి, పగలు శ్రమిస్తుంటే నిర్లక్ష్యంగా రోడ్లపైకి రావడం సరికాదని యువకులకు అవగాహన కల్పించారు. కర్ఫ్యూ కచ్చితంగా పాటిస్తామని వారి చేత ప్రతిఙ్ఞ చేయించి.. వారిని విడుదల చేశారు. అత్యవసర పరిస్థితులు మినహా.. ప్రజలు బయటకు రావద్దని సూచించారు. కరోనా కట్టడికి ప్రజలు అందరు సహకరించాలని కోరారు.
ఇదీ చదవండి:
భార్యకు కరోనా... మనస్థాపంతో భర్త ఆత్మహత్య