గుంటూరు జిల్లా పెదనందిపాడు గ్రామానికి చెందిన క్రాంతి అనే యువకుడు ఎలక్ట్రీషియన్ గా పని చేసేవాడు. విద్యుత్ శాఖ సిబ్బంది అవసరాల నిమిత్తం ఎక్కువగా పనికి వెళ్లేవాడు. ఎప్పటి లాగే క్రాంతి శుక్రవారం విద్యుత్తు స్తంభానికి తీగలు కలిపేందుకు వెళ్ళాడు. కనెక్షన్ ఇస్తుండగా విద్యుదాఘాతానికి గురై కింద పడి మృతి చెందాడు.
బంధువులు క్రాంతి మృతదేహాన్ని విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట ఉంచి ఆందోళన చేశారు. స్తంభాలపై ప్రైవేట్ వ్యక్తులను ఎక్కించి పని చేయిస్తున్నారని ఆగ్రహించారు. గతంలోనూ కొందరు విద్యుత్ షాక్కు గురై చనిపోయారన్నారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు స్తున్నారు.
ఇదీ చదవండి: