ETV Bharat / state

సాధినేని యామినిపై పోలీసులకు వైకాపా ఫిర్యాదు - jagan

ముఖ్యమంత్రి జగన్​పై తెదేపా అధికార ప్రతినిధి సాధినేని యామిని అసభ్యకరంగా సోషల్​ మీడియాలో పోస్టు పెట్టారని వైకాపా నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సాధినేని యామినిపై పోలీసులకు వైకాపా ఫిర్యాదు
author img

By

Published : Jun 10, 2019, 7:54 PM IST

సాధినేని యామినిపై పోలీసులకు వైకాపా ఫిర్యాదు

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తెదేపా అధికార ప్రతినిధి సాధినేని యామిని సోషల్ మీడియాలో అసభ్యకరంగా కామెంట్ చేసిందని ఆరోపిస్తూ గుంటూరు నగర వైకాపా అధ్యక్షురాలు ఝాన్సీ... పట్టాపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తిరుపతికి వస్తే స్వాగతం పలికిన సీఎం జగన్​పై అసభ్యకర కామెంట్ చేశారని మండిపడ్డారు. అధికార ప్రతినిధి అయితే సంక్షేమ పథకాలు, ప్రభుత్య కార్యక్రమాలపై మాట్లాడాలని, సీఎంపై ఇష్టమొచ్చినట్లు కామెంట్లు చేస్తే సహించేది లేదని అన్నారు.

డీజీపీకి యామిని ఫిర్యాదు
జగన్​పై అసభ్యకరంగా కామెంట్లు పెట్టింది తాను కాదని... తన పేరుతో ఎవరో నకిలీ ఖాతా తెరిచారని ఉదయమే డీజీపీకి యామిని ఫిర్యాదు చేశారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత కథనం
దుష్ప్రచారం చేస్తున్నారు.. చర్యలు తీసుకోండి: యామినీశర్మ

Intro:Ap_Nlr_01_10_Balakrishna_Birthday_Somireddy_Kiran_Avbb_C1

ఈవీఎంలపై ప్రజలకున్న అనుమానాలను నివృత్తి చేయడంలో ఎలక్షన్ కమిషన్ విఫలమైందని మాజీ మంత్రి, తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. బాలకృష్ణ అభిమాన సంఘం నేత, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరులోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన సోమిరెడ్డి కేక్ కట్ చేసి బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఎన్నికల్లో ప్రజల ఇచ్చిన తీర్పును గౌరవించి వైకాపా ప్రజాప్రతినిధులు ప్రజా ఉపయోగ పనులు చేపట్టాలని ఆయన కోరారు. అధికారాన్ని అడ్డంపెట్టుకొని తెదేపా నాయకులు, కార్యకర్తలపై కక్షపూరిత చర్యలకు దిగితే పోరాడతామన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు సైతం ఈవీఎంలను వ్యతిరేకిస్తున్నాయని, భారత్ లో మాత్రం ప్రజలకు ఉన్న అపోహలను నివృత్తి చేయడంలోనూ ఎలక్షన్ కమిషన్ విఫలమైందన్నారు. చంద్రబాబు క్రికెట్ కప్ పోటీలు నిర్వహించిన కోటంరెడ్డి ఈ సందర్భంగా గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. మొదటి బహుమతి లక్ష రూపాయలు, రెండో బహుమతి యాభై వేలు, మూడో బహుమతి 25 వేల రూపాయలతోపాటు ట్రోఫీలను క్రీడాకారులకు అందజేశారు. ఇద్దరు వికలాంగులకు మూడు చక్రాల మోటార్ వాహనాలు అందించారు.
బైట్: కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, నుడా చైర్మన్, నెల్లూరు.
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మాజీ మంత్రి.

Body:కిరణ్ ఈటీవీ భారత్

Conclusion:9394450291

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.