అవినీతికి పాల్పడినందునే మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్‌ను అరెస్టు చేశారని వైకాపా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అన్నారు. గుంటూరులో పార్టీ కార్యాలయంలో మాట్లాడిన ఆమె.. తప్పు చేసి తప్పించుకోవడం సాధ్యం కాదని రుజువైందని తెలిపారు. తెదేపా నేతలు అధికారం ఉన్నప్పుడు ఇష్టారీతిన వ్యవహరించారని విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వం అవినీతికి తావు లేకుండా పని చేస్తోందని ఎమ్మెల్యే శ్రీదేవి అన్నారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్న ఆమె.. సీఎం జగన్ రైతుల కోసం మంచి పథకాలు తీసుకువచ్చారన్నారు.
ఇదీ చూడండి..