మండలిలో 6 బిల్లులు ఆగిపోయాయని తెదేపా ఎమ్మెల్సీ బచ్చుల అర్జనుడు తెలిపారు. ద్రవ్య వినిమయ బిల్లు, సీఆర్డీఏ చట్టం రద్దు, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లులు ఆమోదం పొందలేదని వెల్లడించారు. మధ్యాహ్నం నుంచి 18మంది మంత్రులు మండలిలో కవ్వింపు చర్యలకు దిగారని మండిపడ్డారు.
'వైకాపా నేతలు మండలిలో నానా హంగామా చేశారు. 18 మంత్రులు మమ్మల్ని దుర్భాలాడారు. ఛైర్మన్‌ను సైతం దుర్భాషలాడారు. 16 బిల్లుల్లో 10 బిల్లులకు ఆమోదం తెలిపాం. ఫోటోలు తీశారంటూ అబద్ధాలు చెబుతున్నారు' అని బచ్చుల అర్జునుడు తెలిపారు.
ఇదీ చదవండి