వివాహేతర సంబంధం కారణంగానే వైకాపా నేత సురేంద్ర హత్యకు గురైనట్లు పోలీసులు తెలిపారు. హత్యకేసును ఛేదించిన పోలీసులు.. నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం ఐనవోలుకు చెందిన సవరం సురేంద్ర అదే గ్రామానికి చెందిన నాగరాణితో కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో నాగరాణి.. ఇంటి నిర్మాణ పనులకు వచ్చిన అంజయ్య అనే వ్యక్తితో చనువుగా మెలగడంతో సురేంద్ర పలుమార్లు ఇద్దర్నీ హెచ్చరించారు.
అంజయ్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న నాగరాణిని సురేంద్ర తరుచు కొట్టి చిత్రహింసలకు గురిచేశాడు. దీంతో సురేంద్రను హతమార్చాలని నాగరాణి, అంజయ్య నిర్ణయించుకున్నారు. ఈనెల 18న రాత్రి సురేంద్రను నాగమణి ఇంటికి పిలిచింది. అప్పటికే ఇంటి వద్ద ఉన్న అంజయ్య....సురేంద్రను బలంగా కర్రతో తలపై కొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
ఇదీ చదవండి: గర్భిణిని రైలు నుంచి తోసేసిన కేసులో జీవితఖైదు