YCP leader post viral in social media: వైకాపా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ.. అధికార పార్టీ నేతలు పెట్టిన పోస్టులు కలకలం రేపాయి. చట్టసభలకు ఎన్నికై మరణించిన వారికి సంతాపం తెలపటం సాంప్రదాయంగా కొనసాగుతుందని.. నేడు అలాంటి సాంప్రదాయాలకు వైకాపా ప్రభుత్వం తిలోదకాలిచ్చిందని గుంటూరుకు చెందిన... వైకాపా సీనియర్ నాయకుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
మాజీ ముఖ్యమంత్రి దివంగత రోశయ్యకు అసెంబ్లీలో సంతాపం తెలియజేయకపోవటం ఘోరమైన తప్పిదంగా భావిస్తున్నారు. యడ్లపాటి వెంకట్రావును విస్మరించడం అన్యాయమన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి సభ్యున్ని గౌరవించుకోవాలని హితువు పలికారు.
![YCP post in social media](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14688816_mm.jpg)
![YCP post in social media](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14688816_nm-2.jpg)
Atchenna on Mining: మావోయిస్టుల లేఖపై వైకాపాది తప్పుడు ప్రచారం: అచ్చెన్నాయుడు