లాక్ డౌన్ కారణంగా అధికారులు ఉదాసీనంగా ఉండటంతో అక్రమార్కులు పెట్రేగిపోతున్నారు. గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం చిరుమామిళ్ళ వద్ద చారిత్రక మట్టికట్టను తొలగించి... మట్టిని స్థానిక వైకాపా నాయకుడు విక్రయిస్తున్నారు. నాదెండ్ల- చిరుమామిళ్ళ మధ్య కాటం రాజుల కాలంలో నక్కవాగు పక్కన పొలాలు ముంపునకు గురికాకుండా మట్టితో ఈ కట్టను నిర్మించారు. గ్రామానికి చెందిన సీనియర్ వైకాపా నాయకుడి కన్ను దీనిపై పడింది. పది రోజులుగా రాత్రివేళ కట్ట మట్టిని తవ్వి టిప్పర్లతో తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
ఈ విషయం పోలీస్, రెవెన్యూ అధికారుల దృష్టికి రైతులు తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. ఆగ్రహించిన అదే గ్రామానికి చెందిన రైతు భవనం మస్తాన్ రెడ్డి... మట్టి తవ్వకాలను అడ్డుకున్నాడు. సదరు వైకాపా నాయకుడి కుమారుడు ఆ రైతుపై దాడిచేశాడు.