ETV Bharat / state

YCP Govt is Teaching TOEFL to Students With Maths and Social Teachers: కంటెంట్ ఇవ్వకుండానే లెక్కలు, సోషల్ టీచర్లతో టోఫెల్ బోధన

YCP Govt is Teaching TOEFL to Students With Maths and Social Teachers: విద్యార్థులు ఆంగ్లభాషలో నైపుణ్యం సాధించాలంటే నిపుణులైన ఆంగ్లభాష సబ్జెక్టు టీచర్లతో శిక్షణ ఇప్పించాలి. కానీ విద్యా సంస్కరణలు తీసుకొచ్చామంటూ పదే పదే చెప్పే జగన్‌ సర్కార్‌ ఏం చేస్తోందో తెలుసా?.. చదివి అవగాహన చేసుకోవడం, విని అర్థం చేసుకోవడం, మాట్లాడే నైపుణ్యాలను అందించే బాధ్యతలను లెక్కలు, సోషల్‌ మాస్టర్లకు అప్పగించింది. సబ్జెక్టుతో సంబంధం లేని, శిక్షణ లేనివారితో టోఫెల్‌ చెప్పించడం ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

teaching_toefl
teaching_toefl
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 9, 2023, 11:03 AM IST

Updated : Oct 9, 2023, 11:09 AM IST

YCP Govt is Teaching TOEFL to Students With Maths and Social Teachers: ఈ ఏడాది జూన్‌ 12న పల్నాడు జిల్లా క్రోసూరులో విద్యాకానుక పంపిణీ కార్యక్రమంలో సీఎం జగన్‌ టోఫెల్‌పై అనేక మాటలు చెప్పారు. పేద పిల్లలకు ఆంగ్లభాష నైపుణ్యాలు అందించేందుకు టోఫెల్‌ తీసుకొచ్చామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం.. పిల్లలకు నాణ్యమైన శిక్షణ ఇప్పించకుండా వారి జీవితాలతో ఆటలాడుతోంది. టోఫెల్‌ కంటెంట్‌ను ఇంతవరకు ఇవ్వలేదు, ఉపాధ్యాయులకు శిక్షణ అందించలేదు. కానీ, టోఫెల్‌ చెప్పాలంటూ టీచర్లపై ఒత్తిడి చేస్తోంది. ఏ దేశంలోనైనా టోఫెల్‌ సిలబస్‌ను ఆంగ్ల సబ్జెక్టు టీచర్లు చెబుతారు. ఇక్కడ మాత్రం సామాన్యశాస్త్రం, సాంఘికశాస్త్రం, గణితం ఉపాధ్యాయులే చెప్పాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.

YSRCP Govt actions to close aided schools ఎయిడెడ్‌ స్కూల్స్​పై కత్తి దూస్తోన్న వైసీపీ సర్కార్.. ఇప్పటికే 168 మూసివేత!

రోజువారీ బోధనతో తీరిక లేకుండా ఉండే ఈ ఉపాధ్యాయులు టోఫెల్‌ ఎలా చెబుతారు? ప్రచారం కోసం ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం, దాన్ని పేదపిల్లలపై రుద్దడం జగన్‌ సర్కార్‌కి పరిపాటిగా మారింది. పాఠశాల విద్యాశాఖలోని ఓ కీలక అధికారి తీసుకుంటున్న నిర్ణయాలు విద్యావ్యవస్థను సర్వనాశనం చేస్తున్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 3 నుంచి 9 తరగతుల విద్యార్థులకు నిర్వహిస్తున్న టోఫెల్‌ శిక్షణ అపహాస్యంగా మారింది. 3 నుంచి 5 తరగతులకు టోఫెల్‌ ప్రైమరీ, 6 నుంచి 9 తరగతులకు టోఫెల్‌ జూనియర్‌ నిర్వహిస్తున్నారు. వీరికి ఆంగ్లభాష సబ్జెక్టు ఉపాధ్యాయులతో కాకుండా లెక్కలు, సోషల్‌ టీచర్లతో పాఠ్యాంశాలు చెప్పిస్తున్నారు.

ఈ సబ్జెక్టుల్లో సిలబస్‌ను సకాలంలో పూర్తిచేయడమే కష్టం. ఇప్పుడు వాటితోపాటు టోఫెల్‌ శిక్షణా ఇవ్వాలట! వీరికి ఇప్పటివరకు టోఫెల్‌ గురించిన అవగాహన కల్పించలేదు. మరోపక్క టోఫెల్‌ తరగతుల కోసమని 3నుంచి 9 తరగతుల్లోని ఆంగ్లసబ్జెక్టులో కొన్ని పాఠాలను తొలగించేశారు. టోఫెల్‌ బోధనలో కొంత భాగాన్ని ఇతర సబ్జెక్టు ఉపాధ్యాయులకు అప్పగించిన ప్రభుత్వం.. ఆంగ్ల ఉపాధ్యాయులను టోఫెల్‌కు అదనపు తరగతులు నిర్వహించాలని ఆదేశించింది. 3నుంచి 5 తరగతులకు వారానికి ఆరు, 6 నుంచి 9 తరగతులకు వారానికి అయిదు పీరియడ్లు టోఫెల్‌ చెప్పాలని సూచించింది. వీటి కోసం ఆంగ్లం సబ్జెక్టులో సిలబస్‌ తగ్గించింది.

Govt Schools Admissions Reduced: ప్రభుత్వ స్కూల్స్​లో భారీగా తగ్గిన ప్రవేశాలు.. ఇదేనా సమూల మార్పు..?

ఆంగ్లం సబ్జెక్టులో పాఠాల తొలగింపులోనూ ఎన్నో వింతలున్నాయి. కంటెంట్‌ ఇతర సబ్జెక్టుల్లో ఉండటం, పై తరగతుల్లో ఉండటం, పాఠం ఎక్కువగా ఉండటంతో వీటిని తొలగించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. పాఠ్యపుస్తకాలు రూపొందించే సమయంలో ఈ లోపాలున్నట్లు రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి (NCERT)కి తెలియలేదా? మూడోతరగతిలో యూనిట్‌-5,8లలో కొన్ని పాఠాలు తీసేశారు. ఇవి మతం, నైతికత స్టోరీలు. నోబ్యాగ్‌ కార్యక్రమంలో వస్తున్నందున తొలగించినట్లు ఎస్‌సీఈఆర్టీ పేర్కొంది. ఇతర యూనిట్లతో పోలిస్తే ఇవి కష్టంగా ఉన్నాయని, సులభమైన భాషలో లేనందున తీసేసినట్లు వెల్లడించింది. నిజంగానే అంత కష్టంగా ఉంటే మూడోతరగతి పుస్తకంలో ఎలా పెట్టారు? ఏడోతరగతిలో యూనిట్‌-5, 7లలోని పాఠాలు తొలగించారు. ఇతర పాఠాలతో పోలిస్తే వీటిలో ఆంగ్లపదాలు కఠినంగా ఉన్నాయని తీసేశామని పేర్కొంది.

Lack of Facilities in Govt Schools: వానొస్తే సెలవే..! సర్కారు బడిలో సమస్యల తిష్ట..

మొక్కలు, జంతువుల పేర్లు పలకడం, అర్థం చేసుకోవడం కష్టంగా ఉందని వెల్లడించింది. ఇలాంటి పాఠాలను ఏడోతరగతిలో పెట్టాలని సూచించింది ఎవరు అన్న ప్రశ్న వినిపిస్తోంది. ఎనిమిదో తరగతిలో యూనిట్‌-5, 7లలోని పాఠాలు తొలగించారు. కేంబ్రిడ్జ్‌ సందర్శన.. దివ్యాంగుడి కథనం తొమ్మిదో తరగతిలోని ది సౌండ్‌ ఆఫ్‌ మ్యూజిక్‌లో వచ్చినందున అవసరం లేదంటూ తీసేసింది. సప్లిమెంటరీ రీడర్‌లోని భారతదేశ ప్రాచీన విద్యావిధానం అనే పాఠం భౌతికశాస్త్రం, సాంఘికశాస్త్రంలోని పాఠాల్లో ఉన్నందున తొలగించినట్లు పేర్కొంది. ఇంతకాలం ఎస్‌సీఈఆర్టీకి ఈ విషయం తెలియదా? తొమ్మిదో తరగతిలో యూనిట్‌-7,9 పాఠాలు తీసేశారు. ఇందులో బెగ్గర్‌ పాఠంలోని సందేశం కంటే ఇతర పాఠాల్లో మంచి సందేశం ఉన్నందున తొలగించినట్లు ఎస్‌సీఈఆర్టీ వెల్లడించింది.

Last Updated : Oct 9, 2023, 11:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.