ETV Bharat / state

Yarlagadda Venkatarao Joining in TDP: టీడీపీ తీర్థం పుచ్చుకోనున్న యార్లగడ్డ.. అధికారిక ముహూర్తం ఫిక్స్​..

Yarlagadda Venkatarao Joining in TDP: గన్నవరంలో రాజకీయాలు రోజురోజుకు మారుతున్నాయి. టీడీపీలో విజయం సాధించిన ఎమ్మెల్యే.. అనాధికారికంగా వైసీపీకి మద్దతు తెలపటం, నమ్ముకున్న పార్టీలో తనకు ప్రాధాన్యం లభించకపోవటంతో ఆయన వైసీపీని విడాలనుకుని టీడీపీలో చేరేందుకు నిశ్చయించుకున్నారు. అందుకోసం అధికారికంగా ముహుర్తం ఖరారు కావటంతో వైసీపీ నేత యార్లగడ్ల టీడీపీలో చేరనున్నారు.

Yarlagadda_Venkatarao_Joining_in_TDP
Yarlagadda_Venkatarao_Joining_in_TDP
author img

By

Published : Aug 21, 2023, 8:40 AM IST

Updated : Aug 21, 2023, 11:05 AM IST

Yarlagadda Venkatarao Joining in TDP: టీడీపీ తీర్థం పుచ్చుకోనున్న యార్లగడ్డ.. అధికారిక మూహూర్తం ఫిక్స్​..

Yarlagadda Venkatarao Joining in TDP: గన్నవరం నియోజకవర్గంలో సమీకరణాలు మారుతున్నాయి. వైసీపీ సీనియర్‌ నేత, కృష్ణా జిల్లా సెంట్రల్‌ బ్యాంకు మాజీ ఛైర్మన్‌ యార్లగడ్డ వెంకట్రావు సైకిల్‌ ఎక్కేందుకు సిద్ధమయ్యారు. మంగళవారం రోజున గన్నవరంలో జరిగే భారీ బహిరంగ సభలో ఆయన.. టీడీపీ కండువా కప్పుకోనున్నారు.

గన్నవరం నియోజకవర్గం నుంచి యార్లగడ్డ వెంకటరావుతో పాటు ఆయన అనుచరులు మంగళవారం రోజున తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం తరపున యార్లగడ్డ రంగంలోకి దిగుతారనే ప్రచారం జోరందుకుంది. గత ఎన్నికల్లో గన్నవరంలో వల్లభనేని వంశీపై కేవలం 838 ఓట్ల తేడాతో వెంకట్రావు ఓడిపోయారు.

Yarlagadda Venkatrao Met Chandrababu: గుడివాడ నుంచైనా పోటీకి సిద్ధం.. చంద్రబాబుతో భేటీ అనంతరం యార్లగడ్డ వెంకట్రావు

2019 ఎన్నికల అనంతరం జరిగిన పరిణామాల్లో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీని విభేదించి వైసీపీకి మద్ధతు ప్రకటించారు. అనధికారికంగా వైసీపీ ఎమ్మెల్యేగా మారారు. గన్నవరం నియోజకవర్గం ఇంచార్జిగా పేరుకే యార్లగడ్డ వెంకట్రావు ఉన్నా.. అధికారం మొత్తం ఎమ్మెల్యే వంశీదే.

తర్వాత 2019 డిసెంబరులో యార్లగడ్డకు డీసీసీబీ ఛైర్మన్‌ పదవి అప్పగించారు. ఆయన ఆపదవిలో 13 నెలలు మాత్రమే ఉన్నారు. 2021జనవరిలో ఆకస్మికంగా డీసీసీబీ పదవి నుంచి తొలగించి తన్నీరు నాగేశ్వరరావుకు అప్పగించారు. ఆయనను తొలగించి తాజాగా తాతినేని పద్మావతికి ఇచ్చారు.

గన్నవరంలో వైసీపీకి ఎదురుదెబ్బ.. పార్టీ వీడుతున్నట్లు ప్రకటించిన యార్లగడ్డ వెంకట్రావు

టీడీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేకు ప్రాధాన్యం ఇచ్చి తనను పక్కన పెట్టారనే భావనలో యార్లగడ్డ ఉండేవారు. పలుమార్లు పంచాయతీ సీఎం దగ్గరుకు వెళ్లినా.. వంశీతో కలిసి పనిచేయాలని సూచించేవారు. కానీ ఇద్దరికీ పొసిగేది కాదు. తరచూ పరస్పర విమర్శలు చేసుకునే వారు.

తన విషయం తాడోపేడో తేల్చాలని పలుమార్లు యార్లగడ్డ సీఎంను కోరారు. ఎట్టకేలకు పొమ్మనకుండానే పొగపెట్టినట్టు 2021లోనే డీసీసీబీ పదవి తొలగించారు. తర్వాత ఆమెరికా వెళ్లిన ఆయన తిరిగి ఇటీవల మళ్లీ వచ్చారు. ఆరోగ్యం బాగోలేక కొంత మౌనంగా ఉన్నారు.

ఇప్పటికే చంద్రబాబును యార్లగడ్డ హైదరాబాద్‌లో కలిశారు. తనతోపాటు అనుచరులు ఏఎంసీ మాజీఛైర్మన్‌ కోటగిరి వరప్రసాద్, మాజీ ఎంపీపీ ఝాన్సీ, సర్పంచ్‌ విజయ్‌భాస్కర్, మాజీ ఎంపీపీ కొల్లా ఆనంద్‌ తదితరులు మంగళవారం రోజున తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయి.

Gannavaram YCP leader Yarlagadda meet with Party Activists: వచ్చే ఎన్నికల్లో గన్నవరం నుంచే పోటీ చేస్తా: యార్లగడ్డ వెంకట్రావు

Last Updated : Aug 21, 2023, 11:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.