దాచేపల్లి పెదగార్లపాడులోని ఓ సిమెంట్ కర్మాగారంలో పని చేసే కార్మికుడు కొత్త శ్రీనివాసరావు(25) ప్రమాదవశాత్తు మృతి చెందాడు. విధి నిర్వహణలో భాగంగా శుభ్రం చేస్తున్న సమయంలో బెల్ట్‌లో పడి మరణించాడు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం గురజాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, బంధువులు కర్మాగారం ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి ఆందోళన నిర్వహించారు. మృతదేహాన్ని చూపించాలని, తమ కుటుంబానికి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కంపెనీ సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై బాలనాగిరెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి: