నిర్మాణంలో ఉన్న భవనంపై నుంచి పడి కార్మికుడు మృతి చెందిన ఘటన తెనాలి ప్రాంతంలోని పద్మశాలిపేటలో జరిగింది. గుంటూరుకు చెందిన జాషువా (19) కొన్ని రోజులుగా తెనాలిలో భవన నిర్మాణ పనులు చేస్తున్నాడు.
ఈ క్రమంలో ప్రమాదవశాత్తు భవనం పై నుంచి జారిపడి తీవ్రంగా గాయపడగా.. తోటి కార్మికులు స్థానిక ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: