గుంటూరు జిల్లా మాచర్లలోని సబ్ రిజిస్టర్ కార్యాలయ ఆవరణలో.. ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించింది. తన పిల్లలతో కలిసి పురుగల మందు తాగేందుకు యత్నించగా.. అక్కడున్న వారు అప్రమత్తమై అడ్డుకున్నారు. వెల్దుర్తి మండలంగుండ్లపాడు గ్రామానికి చెందిన సాని పద్మ అనే మహిళ.. తన భర్తకు రావాల్సిన ఆస్తులు అత్తింటి వారు ఇంతవరకు పంపిణీ చేయలేదని పేర్కొంది. ప్రస్తుతం ఆస్తుల పంపకాల విషయంలో మానసికంగా ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపింది. తన భర్త పేరు మీద కాకుండా తన పిల్లల పేరు మీద ఆస్తులు రాయాలని అడగటంతో.. ఇంట్లో వివాదం జరిగినట్లు వివరించింది. తనకు న్యాయం జరగాలని తన ఇద్దరు కుమారులతో కలిసి సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్దకు చేరుకుని ఆత్మహత్యకు యత్నించింది. పోలీసులు మహిళను విచారించి వివరాలు సేకరించారు.
ఇదీ చదవండి: