గుంటూరు బ్రాడిపేటలోని ఓ లేడిస్ హాస్టల్ వద్ద గుర్తు తెలియని మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఆ మహిళను పోలీసులు జీజీహెచ్‌కు తరలించారు. ఆమెకు తోడుగా పాప ఉండటంతో పోలీసులు చేరదీశారు. హోంమంత్రి సుచరిత ఇంటి సమీపంలో ఈ ఘటన జరిగింది. అయితే ఈ ఘటనతో ఎలాంటి సంబంధం లేదని హోంమంత్రి కార్యాలయ ప్రతినిధులు తెలిపారు. ఆమె అచూకీ తెలిసివారు 8688831332కు సంప్రదించాలని ఆరండల్ పేట సీఐ నరేశ్ తెలిపారు.
ఇదీ చదవండి: తాలిబన్లపై ధిక్కార స్వరం- ప్రధాన నగరాల్లో ప్రజల నిరసనలు!