ETV Bharat / state

"వీళ్లు సాధారణ మహిళలు కాదు.. ముఖ్యమంత్రికి రక్షకులు" - ముఖ్యమంత్రి భద్రతలో ఉన్న మహిళలు

The protectors of the Chief Minister: చుట్టూ కోట్లమంది అభిమానులు.. వాళ్లు పంచే ప్రేమ! ప్రజానాయకులు ఎదురైనప్పుడు అదే చూస్తాం.. గమనిస్తాం! ఆ అభిమానం మాటున పొంచి ఉన్న ప్రమాదాన్ని పసికట్టే డేగకళ్లు కూడా ఉంటాయి. అదే భద్రతావలయం. సాధారణంగా ఈ విధుల్లో మగవాళ్లే కనిపిస్తారు. కానీ ‘మేమూ వాళ్లతో సమానమే’ అని నిరూపించుకున్నారు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ భద్రతా సిబ్బందిలో ఉన్న మహిళా అధికారిణులు..

The protectors of the Chief Minister
The protectors of the Chief Minister
author img

By

Published : Dec 14, 2022, 10:55 AM IST

The protectors of the Chief Minister: ముఖ్యమంత్రికి వ్యక్తిగత భద్రత అంటే సాధారణ విషయం కాదు. చూపులు.. బుల్లెట్‌ కన్నా వేగంగా దూసుకుపోవాలి. ఆపదలను స్కానర్ల కన్నా ముందే పసిగట్టాలి. రెప్పపాటులో అప్రమత్తం కావాలి. ప్రాణాలివ్వడానికైనా సిద్ధపడాలి. అంతటి తెగువ, సాహసం, గుండె ధైర్యం ఉన్న వాళ్లే ఈ పనికి అర్హులు. ‘ఇవన్నీ ఆడవాళ్లు చేయగలరా?’ అని అంతా సంశయించిన సమయంలోనే వాళ్ల అనుమానాల్ని పటాపంచలు చేస్తూ విజయవంతంగా రాణిస్తున్నారీ మహిళలు. వారే.. ఎస్‌ఐ ధనుష్‌ కన్నగి, హెడ్‌కానిస్టేబుల్‌ దిల్షాన్‌ బేగం, కానిస్టేబుళ్లు పవిత్ర, మోనిషా, విద్య, కాళీశ్వరి, సుమతి, కౌసల్య, రామిలు. 10నెలలుగా ముఖ్యమంత్రి భద్రతా విధులు నిర్వర్తిస్తూ శభాష్‌ అనిపించుకున్నారు.

సామాన్యులకు చోటు..: ముఖ్యమంత్రి భద్రతలోనూ మహిళలకు స్థానం కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఏడాది తమిళనాడు ప్రభుత్వం.. మహిళా పోలీసుల నుంచి దరఖాస్తుల్ని ఆహ్వానించింది. రాష్ట్రవ్యాప్తంగా 80 మంది దరఖాస్తు చేసుకున్నారు. ముఖ్యమంత్రికి రక్షణ కల్పించే సత్తా తమలో ఉందని, అందుకు మానసికంగా సిద్ధంగా ఉన్నామని, ఎలాంటి పరిస్థితులకైనా తట్టుకుంటామని ధ్రువపత్రాలు సమర్పించారు. అనేక వడపోతలు, కఠిన శిక్షణ తర్వాత వీరిలో తొమ్మిది మందిని ఎంపిక చేశారు. ఈ ఏడాది మహిళా దినోత్సవం రోజు నుంచీ వారికి సీఎం భద్రతా బృందంలో స్థానం కల్పించారు. ‘ఏ స్థాయి భద్రతా విధులైనా నిర్వహించగలమని బలంగా నమ్మాం. సీఎం కోర్‌ ప్రొటెక్షన్‌ టీంలో అవకాశం రావడం మాకో పెద్ద సవాల్‌. పనితీరుతో నిరూపించుకుంటున్నాం’ అని చెప్పారు ఈ బృందానికి నేతృత్వం వహిస్తున్న ధనుష్‌ కన్నగి. సీఎం కాన్వాయ్‌లో వీరికి ప్రత్యేక వాహనాన్నీ కేటాయించారు.

కఠిన శిక్షణ..: చెన్నైలోని తమిళనాడు కమాండో ఫోర్స్‌ ట్రైనింగ్‌ స్కూల్‌లో కఠినమైన శిక్షణ తీసుకున్న తర్వాతే వీరంతా ఈ స్థాయికి చేరుకున్నారు. ‘తెల్లవారుజాము నుంచే మైదానంలో పరుగులు పెడుతూ, వేగంగా పుషప్స్‌ చేస్తూ దినచర్యను మొదలు పెట్టే వాళ్లం. అత్యాధునిక ఆయుధాల వాడకంలో తర్ఫీదు పొందాం. ఆటోమేటిక్‌, సెమీ ఆటోమేటిక్‌ ఇలా.. పలు రకాల తుపాకుల ఫైరింగ్‌లో ప్రతిభ కనబరిచాం. బాంబుల్ని గుర్తించడం, రద్దీని చాకచక్యంగా నియంత్రించడం, కారు, మోటారుబైక్‌ల్ని వేగంగా నడపడం, చేతిలో ఆయుధం లేకున్నా ఏకకాలంలో కనీసం అయిదుగురితో పోరాడటం వంటివి మా శిక్షణలో కొన్ని ముఖ్యమైన అంశాలు. మార్షల్‌ ఆర్ట్స్‌ కూడా నేర్చుకున్నాం. అన్నింటికీ మించి ఒత్తిడిని జయించడం, ప్రమాదాల్ని అత్యంత వేగంగా గుర్తించడంలోనూ శిక్షణ ఇచ్చార’ని అంటున్నారీ బృంద సభ్యులు.

చేతుల్లో ఎక్స్‌-95..: ముఖ్యమంత్రి స్టాలిన్‌ ప్రస్తుతం.. జెడ్‌ప్లస్‌ కేటగిరీ భద్రతలో ఉన్నారు. ఆయనకు దగ్గరగా ఉండే కీలక బృంద సభ్యులే వీరంతా. సీఎంను ఎవరు కలవాలన్నా వీరి అనుమతి పొందాల్సిందే. నిమిషానికి 750 నుంచి 950 రౌండ్లు కాల్చే ఎక్స్‌-95 సబ్‌మెషిన్‌ గన్లు వీరి చేతుల్లో ఉంటాయి. ఏకే-47, 9ఎంఎం పిస్టల్‌ లాంటి ప్రత్యేక ఆయుధాలూ ధరిస్తారు. సీఎం పర్యటనల్లో ఉన్నప్పుడు సఫారీ దుస్తుల్లో ఉంటూ రద్దీని చాకచక్యంగా నియంత్రిస్తారు. వీరి పని తీరుకు మెచ్చిన ముఖ్యమంత్రి అన్ని షిఫ్టుల్లోనూ, అన్ని రకాల పర్యటనల్లోనూ వీరికి అవకాశం కల్పిస్తున్నారు. ‘మహిళలమైనా ఈ విధులు మాకేమీ ఇబ్బందిగా అనిపించడంలేదు. మా స్ఫూర్తిని అందుకుని మరికొంతమంది యువతులు పోలీసు, రక్షణ రంగాల్లో సంక్లిష్ట బాధ్యతల్లోకి వస్తారని ఆశిస్తున్నాం’ అంటున్నారీ మహిళలు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.