
గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం చింతపల్లిపాడుకు చెందిన మన్నవ రత్నకుమారి (52) ఐదు ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి, మిరప పంటలు సాగు చేస్తోంది. గతేడాది ఆశించిన విధంగా దిగుబడి రాకపోవటం....ఈ ఏడాది కూడా అలానే ఉండటంతో అప్పులు ఎక్కువయ్యాయి. కొద్దిరోజులుగా ఈ విషయమై మదనపడుతున్న ఆమె పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు గమనించి గుంటూరు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.