రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని కిందపడిన మహిళపై నుంచి.. వెనకే వస్తున్న లారీ వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. భర్త కళ్లెదుటే భార్య మరణించిన ఈ హృదయ విదారక ఘటన.. గుంటూరు జిల్లా వట్టి చెరుకూరు మండలంలో జరిగింది. అప్పటివరకు తనతో సరదాగా మాట్లాడిన భార్య విగతజీవిగా పడి ఉండటం చూసి ఆమె భర్త కన్నీరుమున్నీరుగా విలపించారు.
ఇదీ చదవండి: యూపీలో బాలికపై సాముహిక అత్యాచారం
ప్రత్తిపాడు మండలం తిక్కిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన భార్యాభర్తలు ద్విచక్రవాహనంపై గుంటూరు వెళ్తున్నారు. ఊహించని రీతిలో మరో ద్విచక్రవాహనం ఢీకొనడంతో పిల్లి జ్యోతి (35) కింద పడిపోయింది. వెనుక వచ్చిన లారీ ఆమె తలపై నుంచి దూసుకువెళ్లడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:
బాపట్లలో పాలిటెక్నిక్ ప్రశ్నాపత్రం లీక్.. పోలీసులకు ఫిర్యాదు