నెల్లూరు జిల్లా ఒరికుంటపాడు మండలం కొండయ్యపాలెంకు చెందిన కుమారి వెంకమ్మ గత కొద్ది సంత్సరాల నుంచి గుండె దడ , ఆయాసంతో భాదపడుతోంది. 10 రోజుల క్రితం ఒంగోలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె.. మెరుగైన వైద్యం కోసం గుంటూరులోని సాయి భాస్కర్ ఆసుపత్రికి వచ్చారు. ఒంగోలు కొవిడ్ పరీక్షలు చేస్తే నెగెటివ్ వచ్చిందని.. గుంటూరులో ఈ నెల 3న ఆసుపత్రిలో చేరినప్పుడూ నెగెటివ్ అని చెప్పారు. గత వారం నుంచి చికిత్స పొందుతున్న ఆమెను రేపు డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు చెప్పారు. అయితే ఈలోపే ఆమె ఆసుపత్రి పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. సంఘటన స్థలానికి చేరుకున్న అరండల్ పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: అంగన్వాడీల రూపురేఖలను మార్చబోతున్నాం: జగన్