వాయు కాలుష్యాన్ని నియంత్రించే లక్ష్యంతో... రవాణా శాఖ గుంటూరులో ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. డీటీసీ మీరాప్రసాద్ ఆధ్వర్యంలోని అధికారుల బృందం చుట్టుగుంట వద్ద వాహనాలను తనిఖీ చేసింది. వాహనాలకు సంబంధించిన ధ్రువపత్రాలను పరిశీలించారు. గుంటూరు నగరంలోకి అధిక లోడుతో వచ్చే వాహనాలపై భారీగా జరిమానాలు విధించనున్నామని డీటీసీ మీరాప్రసాద్ చెప్పారు. ఇసుక, కంకరను వాహనాల్లో తీసుకెళ్లేటప్పుడు టార్పాలిన్ తప్పక వేయాలని... లేకుంటే జరుమానా విధిస్తామని డీటీసీ హెచ్చరించారు.
ఇదీ చదవండి: