ఆంధ్రప్రదేశ్‌ను మద్యరహితంగా మార్చడమే జన చైతన్య వేదిక ప్రధాన లక్ష్యమని వేదిక కన్వీనర్ లక్ష్మారెడ్డి వ్యాఖ్యనించారు. గుంటూరు జిల్లా అరుండల్ పేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన... మద్యనిషేధంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తామన్నారు. ఈ నెల 12న ఈ అంశంపై గుంటూరు జిల్లా పలకలూరులోని విజ్ఞాన్ మహిళా కళాశాలలో రాష్ట్రస్థాయి సదస్సు ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు. మద్యపాన నిషేధానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీచదవండి