గుంటూరు జిల్లా బాపట్లలో రేషన్ బియ్యం పంపిణీ ప్రహసనంగా మారింది. పట్టణంలోని 24వ వార్డులో బియ్యం నిల్వలు లేక చౌక దుకాణం సిబ్బంది చేతులెత్తేశారు. ఉదయం నుంచే దుకాణాల వద్ద వ్యక్తిగత దూరం పాటిస్తూ బారులు తీరుతున్నా.. తమను పట్టించుకోవడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బియ్యం సరఫరా చేయాలని కోరుతున్నారు. ప్రస్తుతం నిల్వలు నిండుకున్నాయని.. సరుకు రాగానే పంపిణీ చేస్తామని దుకాణాల నిర్వాహకులు బదులిస్తున్నారు.
ఇదీ చూడండి: