ETV Bharat / state

అదుపుతప్పిన ద్విచక్రవాహనం... మహిళ మృతి - ప్రమాదం

బైక్​కు శునకం అడ్డురావడంతో..అదుపు తప్పి క్రైస్తవ బోధకురాలు కింద పడి మృతి చెందారు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది.

women paster died
క్రైస్తవ బోధకురాలు మృతి
author img

By

Published : Jun 28, 2021, 12:11 AM IST

శునకం అడ్డురావడంతో బైక్​పై వెళుతున్న క్రైస్తవ బోధకురాలు అదుపు తప్పి కింద పడి మృతి చెందారు. ఈ ఘటన గుంటూరులో జరిగింది.

పొన్నూరుకు చెందిన క్రైస్తవ బోధకురాలు మాచవరపు శోభాదేవి..తిమ్మాపురం చర్చిలో ప్రార్థలు ముగించుకుని ద్విచక్రవాహనంపై వస్తున్నారు. కాకుమాను మండలం పాండ్రపాడు సమీపంలో ఒక్కసారిగా శునకం.. బైక్ ముందుకు రావడంతో వాహనం అదుపుతప్పి కిందపడింది. దాంతో ఆమె తలకు తీవ్ర గాయమైంది. 108 వాహనం హుటాహుటిన అక్కడికి చేరుకుని పరిశీలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు చెప్పారు.

కళ్లెదుటే ఉన్న ఆమె ఒక్క నిమిషంలో మృతి చెందడంతో బైక్ నడుపుతున్న పాస్టర్ కన్నీటి పర్యంతం అయ్యారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అక్కడి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు.

ఇదీ చదవండి: Tadepalli Incident : 'త్వరలోనే నిందితులను మీడియా ముందు ప్రవేశపెడతాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.