గుంటూరు నగరపాలక సంస్థ పరిధి శాంతినగర్‌లోని 85వ వార్డు సచివాలయంలో అవినీతికి పాల్పడుతున్న కేవీ రూప అనే వార్డు వాలంటీర్‌ను విధుల నుంచి తొలగిస్తూ.. నగర పాలక కమిషనర్ అనురాధ ఉత్తర్వులు జారీ చేశారు. సదరు వాలంటీర్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఒక్కొక్క పథకానికి ఒక్కొక్క ధర నిర్ణయించి దరఖాస్తుదారుల నుంచి డబ్బు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందాయని తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు విచారణ చేయించగా..ఆరోపణలు నిర్ధరణ కావటంతో ఆమెను విధుల నుంచి తొలగించినట్లు కమిషనర్ వివరించారు.
ఇదీ చదవండి: నిధుల వేటలో ప్రభుత్వం... గ్యాస్‌పై 10 శాతం వ్యాట్ పెంపు