వీఆర్‌వోల సంఘం రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా గుంటూరు కలెక్టరేట్ వద్ద వీఆర్వోలు ధర్నా చేపట్టారు. పదోన్నతుల కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న తమ సమస్యలపై.. ఉన్నతాధికారులు స్పందించాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు సూరేపల్లి రాజశేఖర్ కోరారు.
తహసీల్దార్ కార్యాలయం ఆధ్వర్యంలో సచివాలయంలో పనిచేస్తున్న తమకు వేతనాలను కూడా సచివాలయాలకు అనుబంధం చేయటం సరికాదని, తహశీల్దార్ కార్యాలయం నుంచే వేతనాలను అందించాలన్నారు. ప్రభుత్వం తమ న్యాయమైన కోర్కెలను తీర్చాలని కోరారు.
ఇవీ చూడండి: