పట్టాదారు పాసు పుస్తకం కోసం ఓ రైతు నుంచి 50 వేల రూపాయలు లంచం తీసుకున్న గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినకాకాని వీఆర్వో పట్టుబడ్డాడు. చినకాకాని సమీపంలో 75 సెంట్ల భూమి కొనుగోలు చేసిన భూలక్ష్మి అనే రైతు పాస్ పుస్తకం కోసం నెలలుగా రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరిగారు. వీఆర్వో కృష్ణకిషోర్ 50 వేల రూపాయలు డిమాండ్ చేయడంతో... అంత మొత్తం ఒక్కసారిగా చెల్లించలేమని.... 2 దఫాలుగా ముట్టజెప్పారు. ఈ వ్యవహారం మొత్తాన్నీ సంబంధీకులు చరవాణిలో బంధించారు. పాస్ పుస్తకాల కోసం సోమవారం మంగళగిరి తహసీల్దారు కార్యాలయం వద్ద రైతులు ఆందోళనకు దిగారు. వీఆర్వోకు లంచం ఇచ్చామని తహసీల్దారుకు ఫిర్యాదు చేశారు. రైతుల నుంచి డబ్బు తీసుకోలేదని వీఆర్వో బుకాయించగా... వీడియోలు బహిర్గతం చేశారు. ఈ ఘటనతో తహసీల్దారు విచారణకు ఆదేశించారు.
ఇదీ చదవండి :