గుంటూరు జిల్లా వినుకొండ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు కరోనా నివారణపై సమీక్ష నిర్వహించారు. వినుకొండలో 318 కేసులు పాజిటివ్ కేసుల్లో 208 మంది వ్యాధి నుంచి కోలుకుని ఇళ్లకు వెళ్లారని, 105 కేసులు యాక్టివ్గా ఉన్నాయని అన్నారు. వీరిలో 83 మంది హోమ్ ఐసోలేషన్లో, 12 మంది వినుకొండ కోవిడ్ కేర్ సెంటర్లో చికిత్స పొందుతున్నారని, 10 మందిని హాస్పిటల్కి తరలించినట్షు కమీషనర్ తెలియజేశారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ బ్యాంకులు, అన్నిరకాల వ్యాపారసంస్థలు సంస్థలు తెరిచి ఉంటాయన్నారు. వారం రోజులుగా కరోనా ఎనాలసిస్ చేయగా యాభై కేసులు కొత్తగా వచ్చాయని వినుకొండ తహసీల్దార్ వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రజలు అవసరం ఉంటేనే రోడ్లపైకి రావాలన్నారు. అనసరంగా బయటికి వస్తే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.
ఇవీ చదవండి