గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలో బేతపూడి గ్రామస్థులు గ్రామ సచివాలయం వద్ద నిరసనకు దిగారు. ప్రభుత్వం పేదలకు నివేశన స్థలాలు ఇస్తోంది. అందుకు బేతపూడి గ్రామస్థులు 60 మంది దరఖాస్తు చేసుకున్నారు. స్థలాలు మంజూరయ్యాయి. అయితే బేతపూడి వాసులకు గ్రామంలో కాకుండా సమీప గ్రామంలోని గుండాలపాడులో స్థలాలు ఇచ్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు. గుండాలపాడులో తమకు స్థాలాలు వద్దని ...ప్రస్తుతం ఉండే బేతపూడి గ్రామంలోనే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని గ్రామస్థులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: రెవెన్యూ లోటు కింద ఏపీకి 491 కోట్ల రూపాయలు విడుదల