విజయవాడ కాల్ మనీ వ్యాపారుల నుంచి రక్షించాలంటూ గుంటూరు జిల్లా నులకపేటకు చెందిన పూజారి నాగతేజ తాడేపల్లి పోలీసులను ఆశ్రయించారు. విజయవాడకు చెందిన దుక్కా శ్రీను, నులకపేటకు చెందిన లక్ష్మీ, ఝాన్సీలు తనను వేధిస్తున్నారని పేర్కొన్నారు. 'కాల్ మనీ వ్యాపారం చేస్తున్న ఝాన్సీ అనే మహిళ వద్ద రూ. 70వేలు తీసుకున్నాను. వారానికి ఐదు వేల చొప్పున వడ్డీ, అసలు కలిపి 2లక్షలు ఇచ్చాను....ఇంకా రూ. లక్ష బాకీ ఉన్నానని.. అవి వెంటనే తీర్చకపోతే చంపుతామని బెదిరిస్తున్నారని బాధితుడు ఫిర్యాదులో తెలిపాడు.
శ్రీను, లక్ష్మీ, ఝాన్సీ వద్ద ఖాళీ చెక్కులు, ప్రాంసరీ నోటులున్నాయని పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. ఇప్పటికే వారి ఆగడాలకు భయపడి 15రోజులు ఇల్లు విడిచి బయటకు వెళ్లామని తెలిపాడు. తమకు కాల్ మనీ వ్యాపారస్తుల నుంచి ప్రాణహాని ఉందని పేర్కొన్నారు. బాధితుని ఫిర్యాదు మేరకు కాల్ మనీ వ్యాపారులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదీ చూడండి: