గుంటూరు జిల్లా వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీ బీటెక్ చివరి సంవత్సరం రెండో సెమిస్టర్ ఆన్‌లైన్ పరీక్షా ఫలితాలను.. ఉపకులపతి డాక్టర్ ఎంవైఎస్ ప్రసాద్, రిజిస్ట్రార్ ఎం.ఎస్.రఘునాథన్ విడుదల చేశారు. ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించిన అతికొద్ది విద్యా సంస్థల్లో విజ్ఞాన్ యూనివర్సిటీ ముందు వరుసలో నిలిచిందని వీసీ ప్రసాద్ తెలిపారు.
పరీక్షలు పూర్తి చేసిన వారం రోజుల్లోనే ఫలితాలను వెల్లడించి రికార్డు సృష్టించామని వీసీ తెలిపారు. విద్యార్థులు ఎవరి ఇంటి వద్ద వారు.. కంప్యూటర్లు, ల్యాప్‌ట్యాప్ లలో ప్రశ్నాపత్రాలకు జవాబులు రాశారని తెలియజేశారు. ప్రశ్నాపత్రాన్ని ఆబ్జెక్టివ్ విధానంలో తయారు చేసినట్లు చెప్పారు.
ఇదీ చదవండి: