గుంటూరు రైల్వే డివిజన్ అధికారులు లాక్ డౌన్ తర్వాత కేంద్రం అనుమతి ప్రకారం.. రైళ్లు నడపటానికి సిద్ధమవుతున్నారు. ప్రయాణికులు సరైన జాగ్రత్తలు తీసుకునేలా.. రైల్వే తరఫున కూడా రక్షణ చర్యలు పాటించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రయాణికులు ఎలా ఉండాలనే దానిపై ఒక వీడియో రూపొందించారు.
- ప్రయాణికులు స్టేషన్లోకి వచ్చే ముందే వారి టికెట్ చూపించి లోపలకు వెళ్లాలి.
- భౌతిక దూరం పాటిస్తూ.. నిర్దేశించిన మార్గంలో ముందుకు వెళ్లాలి.
- ప్రయాణికులకు మాస్కులు తప్పనిసరి.
- లోపలకు వెళ్లే సమయంలో శానిటైజర్లతో ప్రయాణికుల చేతులు శుభ్రం చేసుకోవాలి.
- ఆ తర్వాత ప్లాట్ ఫారం మీదకు వెళ్లాలి.
- వారి రైలు వచ్చాక... నిర్దేశించిన సీట్లో కూర్చోని ప్రయాణించాలి.
- ఈ ప్రక్రియ అంతా చేయాలంటే స్టేషన్ కు కనీసం రెండు గంటలు ముందుగా రావాలని రైల్వే అధికారులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: