ఏఎన్ఎం ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన గ్రామ, సచివాలయ పరీక్షలలో తనకు అన్యాయం జరిగిందని గుంటూరుకు చెందిన ఆశాజ్యోతి అనే అభ్యర్థిని ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు పాలకలూరుకు చెందిన ఆశాజ్యోతికి 'కీ'ప్రకారం 70 మార్కులు వచ్చాయి... అయితే ఫలితాలలో 36 మార్కులే వచ్చాయని ఆమె వాపోయింది. మైనస్ మార్కులు తొలగించి కూడా చెక్ చేశానని..తనకు జరిగిన అన్యాయంపై ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వం తనకు న్యాయం చేయాలని... తనకు వచ్చిన మార్కులను రీకౌంటింగ్ చేయాలని డిమాండ్ చేసింది. అదే ప్రాంతానికి చెందిన కీర్తన వీఆర్వోకి అప్లై చేయగా... 60 మార్కులు రావాల్సి ఉండగా.. 11 మార్కులే వచ్చాయని ఆవేదన వ్యక్తం చేసింది.
ఇదీచూడండి.సచివాలయ కొలువు... అనుమానాలకు నెలవు...