Vice President presents Ramineni Foundation awards: ప్రపంచంలో ఎక్కడున్నా మాతృభూమిని మరిచిపోకూడదని.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. అప్పుడే మన ఎదుగుదలకు అర్థం ఉంటుందన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగిన రామినేని ఫౌండేషన్ గురు సన్మానం, అమెరికా ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవంలో వెంకయ్య పాల్గొన్నారు. 2020-21 విద్యా సంవత్సరంలో పదో తరగతి పూర్తి చేసిన మొత్తం 280 మంది విద్యార్థులతో పాటు.. గుంటూరు జిల్లాకు చెందిన 32 మంది ఎంఈవోలకు అవార్డుల ప్రదానం చేశారు. ప్రతిభావంతులను ప్రోత్సహిస్తున్న రామినేని ఫౌండేషన్‌ను అభినందించారు. అనంతరం శరత్ చంద్రబాబు 'కథాసూక్తం' పుస్తకాన్ని వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. కార్యక్రమంలో మంత్రి సురేశ్, ఎంపీ మోపిదేవి తదితరులు పాల్గొన్నారు.
విద్యా వికాసానికి పవిత్రమైన గురు-శిష్య బంధం ఎంతో కీలకం.పెంచుకున్నదాన్ని పంచుకోవడంలో ఉన్న ఆనందం వెలకట్టలేం. ఉన్నత స్థానానికి ఎదిగాక మాతృభూమి అభివృద్ధికి కృషి చేయాలి. మూలాలు కాపాడుకుంటూనే మన సంస్కృతి రక్షించుకోవాలి. ప్రవాసాంధ్రుల కోసం కృషి చేస్తున్న రామినేని ఫౌండేషన్‌కు అభినందనలు. -వెంకయ్యనాయుడు, ఉపరాష్ట్రపతి
ఇదీ చదవండి: Venkaiahnaidu: నాయకులే ప్రజల మధ్య చీలికలు తీసుకురావడం బాధాకరం: వెంకయ్యనాయుడు