కృష్ణా, గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గాదె వెంకటేశ్వరరావుకు జనసేన పార్టీ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు పార్టీ పీఏసీ సభ్యులు బోనబోయిన శ్రీనివాస్ తెలిపారు. నామినేషన్‌కు చివరిరోజు గుంటూరు కలెక్టరేట్లో వెంకటేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి జనసేన పార్టీ కట్టుబడి ఉంటుందని బోనబోయిన శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న పార్టీని గురువులు ఆశీర్వదించాలని కోరారు.
ఇదీ చూడండి: వృద్ధురాలన్న కనికరం లేదు... బస్సులో నుంచి దించేసిన సిబ్బంది