వైసీపీ నేతలు గుంటూరు నగరంలో నిత్యావసర సరుకులు పంపిణీ కు శ్రీకారం చుట్టారు. గుంటూరు 29వ డివిజన్ అధ్యక్షుడు షేక్ రోషన్ ఏర్పాటుచేసిన నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాల్లో వైకాపా ఎమ్మెల్యేలు నంబూరి శంకర్రావు, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరి, పార్టీ జిల్లా అధ్యక్షులు లేళ్ల అప్పిరెడ్డి పాల్గొన్నారు. అనంతరం సరుకులను ఆ ప్రాంత నిరుపేదలకు పంపిణీ చేశారు చేశారు. గుంటూరు పశ్చిమ ట్రాఫిక్ పోలీసులకు శానిటైజర్లు, టోపీలను ఎమ్మెల్యే గిరిధర్ పంపిణీ చేశారు.
బతుకుతెరువు కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి వలస కూలీలు గత 10 రోజులు నుంచి తిండి తిప్పలు లేక అలమటించి పోతున్నారు. బీహార్, ఒడిశా ఇతర రాష్ట్రల నుంచి వచ్చిన వలస కూలీలకు గుంటూరు మిర్చియార్డులో యార్డు చైర్మన్ చంద్రగిరి ఏసురత్నం, ఎమ్మార్వో మోహనరావు కూలీలాలకు నిత్యావసర వస్తువులు కూరగాయలు, బియ్యం, అరటికాయలు, ఉల్లిపాయలు పంపిణీ చేశారు.
అయితే.. లాక్ డౌన్ నేపథ్యంలో గుంటూరు నగరంలో అధికార పార్టీ నేతలు నిత్యావసర వస్తువులు, కూరగాయల పంపిణీ నెపంతో జోరుగా ఎన్నికల ప్రచారం జరుపుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. కార్పొరేటర్ అభ్యర్థిగా వైకాపా నేతను గెలిపించాలని ప్రచారం చేస్తున్నని స్థానిక నేతలు ఆరోపిస్తున్నారు. కూరగాయలు, నిత్యావసర సరుకులు సంచిలో వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే, సీఎం ఫోటోలు ఉన్న కరపత్రాలను లబ్దిదారులకు ఇల్లు ఇల్లు తిరిగి అందచేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
ఇదీ చూడండి:
రాష్ట్రంలో మరో 24 మందికి కరోనా.. 135కు చేరిన పాజిటివ్ కేసులు