ఎస్సీ రైతులపై అట్రాసిటీ కేసులు పెట్టిన డీజీపీ, ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో ఎస్సీ, ఎస్టీ కేసులో అరెస్టు అయిన రైతుల కుటుంబసభ్యులను వర్ల రామయ్య పరామర్శించారు. తామంతా అండగా ఉంటామన భరోసా ఇచ్చారు.
తమను ప్రభుత్వం అన్యాయంగా అరెస్టు చేసిందని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారని వర్ల రామయ్య తెలిపారు. అమరావతిలో రైతులు, మహిళల కష్టం ఊరికే పోదన్నారు. గతంలో చాలామంది రైతులను అరెస్టు చేసినా.. వాళ్లకి ఈ తరహాలో బేడీలు వేయలేదని అన్నారు. కేవలం ఎస్సీలన్న ఒక్క కారణంతోనే ప్రభుత్వం వీళ్లకి మాత్రం సంకెళ్లు ఎందుకు వేశారని రామయ్య ప్రశ్నించారు.
ఇదీ చదవండి: రైతులకు బేడీల ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా తెదేపా నిరసనలు