Varla Ramaiah is letter to CM Jagan: ఎమ్మెల్సీ అనంతబాబును జైలు నుంచి విడుదల చేయటాన్ని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఖండించారు. అనంతబాబు విడుదలతో సుబ్రహ్మణ్యం.. తల్లిదండ్రులు భయభ్రాంతులకు గురి అవుతున్నారంటూ ఆయన సీఎంకు లేఖ రాశారు. సీఎంకు దళితుల పట్ల చిత్తశుద్ధి ఉంటే.. ఇప్పటికైనా సీబీఐతో సుబ్రహ్మణ్యం కేసు విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. జగన్ సీఎం అయ్యాక దళితుల మీద జరిగిన ఏ దాడి కేసులోనూ ప్రభుత్వ యంత్రాంగం సంతృప్తికరంగా దర్యాప్తు చేయలేదని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎస్సీ, ఎస్టీ చట్టం దుర్వినియోగానికి గురవుతుందని వర్ల రామయ్య ఆక్షేపించారు.
ఇవీ చదవండి: