భారత మాజీ ప్రధాని అటల్బిహారీ వాజ్పేయి ద్వితీయ వర్ధంతి కార్యక్రమం గుంటూరులో నిర్వహించారు. భాజపా ఆధ్వర్యంలో గుంటూరు పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి కన్నా లక్ష్మీనారాయణ హాజరై వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వశక్తితో పైకి వచ్చిన గొప్ప నాయకుడని కొనియాడారు. ప్రతిపక్షాలూ మెచ్చుకునేలా ఆయన రాజకీయ జీవితం సాగిందని తెలిపారు. దేశానికి వాజ్పేయీ చేసిన సేవలు మరిచిపోలేనివన్నారు. ఆయన ఇచ్చిన స్ఫూర్తితో దేశ ప్రజలు ముందుకు సాగాలని సూచించారు.
ఇవీ చదవండి..