గుంటూరు జిల్లా మంగళగిరి, తాడేపల్లి, తుళ్లూరులో కొవిడ్ టీకా పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి డోస్ తీసుకున్న 60 సంవత్సరాలపైబడిన వారికి తొలిరోజు ప్రాధాన్యమిచ్చారు. 60 సంవత్సరాలు దాటిన వంద మందికి రెండో డోస్ ఇచ్చారు.
రెండో డోస్ కు అర్హులైన వారిని గుర్తించి వాలంటీర్ల ద్వారా స్లిప్ లు పంపించారు. స్లిప్ ఉన్న వారి వివరాలు నమోదు చేసిన తర్వాత టీకా వేశారు. మంగళగిరిలో టీకా ప్రక్రియను ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పరిశీలించారు. టీకా వేసుకునేందుకు వచ్చిన వారికి మౌలిక వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు.
ఇదీ చదవండి: 'రుయా' ఘటనపై సీఎం సీరియస్.. బాధ్యులపై చర్యలకు ఆదేశం