ETV Bharat / state

'హైసెక్యూరిటీ నెంబర్ ప్లేటే వాడండి'

ఏదైనా వాహనం ప్రమాదం భారిన పడినా...లేక దొంగతనానికి గురైనా వాటిని సులువుగా గుర్తించేందుకు...హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ల విధానం తీసుకొచ్చింది ప్రభుత్వం. కానీ అది సక్రమంగా అమలు కావట్లేదు. వాహనానికి కొత్త నెంబరు ఇచ్చి నెంబర్ ప్లేట్ సిద్ధంగా ఉన్నా... వాటిని బిగించుకునేందుకు జనం ఆసక్తి చూపట్లేదు.

number plate
author img

By

Published : Aug 19, 2019, 1:54 PM IST

'హైసెక్యూరిటీ నెంబర్ ప్లేటే వాడండి'

కొత్తగా వాహనం కొన్నవారు రిజిస్ట్రేషన్‌ పూరైన తర్వాత ... శాశ్వత నెంబరు కేటాయిస్తారు. అలాగే రిజిస్ట్రేషన్‌ సమయంలోనే హైసెక్యూరిటీ నెంబర్‌ ప్లేట్‌కు సంబంధించిన డబ్బు వసూలు చేస్తారు. ఆ నెంబర్ ను హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లు తయారీ సంస్థకు పంపిస్తారు. వారు నంబర్ ప్లేట్ సిద్ధం చేసి వాహనదారులకు సమాచారం ఇస్తారు. సదరు యజమాని వాహనాన్ని తీసుకొచ్చి నంబర్‌ ప్లేట్‌ బిగించుకోవాల్సి ఉంటుంది.

అయితే వాహనం కొనుగోలు, రిజిస్ట్రేషన్ పై చూపిన శ్రద్ధ నెంబర్ ప్లేట్లు బిగించుకోవటంలో చూపటం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఏజెన్సీల వద్ద గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన నెంబర్ ప్లేట్లే దీనికి నిదర్శనం. ఒక్క గుంటూరు జిల్లాలోనే 20వేల రవాణా వాహనాలు, 30వేల రవాణేతర వాహనాలు కలిపి... 50వేల మంది వాహనదారులు శాశ్వత నెంబర్ వచ్చి... నెంబర్ ప్లేట్లు సిద్ధమైనా... వాటిని బిగించుకునేందుకు ముందుకు రాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంఖ్య 4లక్షలకు పైగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

ప్రధానంగా రవాణా వాహన యజమానుల్లోనే నిర్లక్ష్యం కనిపిస్తోంది. వ్యక్తిగత వాహనాలు, ద్విచక్ర వాహన యజమానులు మాత్రం ఎక్కువగా వచ్చి ప్లేట్లు బిగించుకుని వెళ్తున్నారు. 2014 తర్వాత అమల్లోకి వచ్చిన నిబంధనల మేరకు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ తప్పనిసరి. ఒకవేళ అలా లేకపోతే జరిమానా తప్పదని అధికారులు హెచ్చరిస్తున్నారు.

హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు... సాధారణ నంబర్‌ ప్లేట్లలా కాకుండా హాలోగ్రామ్‌,నెంబర్‌పై చిన్నచిన్న ఆల్ఫాన్యూమరిక్‌ నెంబర్లు, లేజర్‌ కోడ్‌ తదితర ప్రత్యేకతలతో ఉంటాయి. ఎవరైనా వాహనాన్ని దొంగిలించినా నెంబర్‌ ప్లేట్‌ను తొలగించేందుకు వీల్లేకుండా వీటిని ప్రత్యేక బోల్టులతో బిగిస్తారు. అందుకే అందరూ హై సెక్యూరిటి ప్లేట్లనే వినియోగించాలని అధికారులు సూచిస్తున్నారు.

Intro:అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు .అందులోనూ స్వామి స్వయంభు మూర్తిగా ఉద్భవించెను .చిన వెంకన్న క్షేత్రంలో నిత్య అన్నదానం అంటే ఆ పుణ్యం మాటల్లో చెప్పలేం. వండి వార్చిన వారు ,ఆ దేవదేవుని అన్నప్రసాదాన్ని భక్తితో భుజించిన వారు ఇద్దరూ తరించినవారే .దైవకార్యంలో భక్తుల ఆకలి తీర్చా మన్న తృప్తి వారికి , దైవ సన్నిధిలో స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించనున్న తృప్తి వీరికి.

Body:చిన్న వెంకన్న కొలువైన పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమల దివ్యక్షేత్రం నిత్య కళ్యాణం, పచ్చతోరణంగా విరాజిల్లుతోంది. స్వయం వ్యక్తగా వెలుగొందే ఆ తేజోమూర్తిని చూసేందుకు నిత్యం వేల మంది భక్తులు క్షేత్రానికి వస్తుంటారు. గోవిందా.. గోవిందా.. అంటూ ఆ కలియుగ ప్రత్యక్ష దైవాన్ని చూసేందుకు క్యూలు కడతారు. భక్తితో మొక్కుబడులు, తలనీలాలు ,నిలువు దోపిడీ చెల్లించుకుంటారు. కనులారా స్వామి వారి దర్శనం చేసుకునే భక్తులు కడుపారా శ్రీవారి అన్నప్రసాదాన్ని స్వీకరించి ఆకలి తీర్చుకుంటున్నారు.దేవస్థానం 1987లో ఆగస్టు 8న 25 మంది భక్తులతో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించింది .1998లో ఏప్రిల్ 2న స్వామివారి నిత్యాన్నదాన పథకాన్ని ఏర్పాటు చేసింది. భక్తుల సౌకర్యార్థం 2018లో సెప్టెంబర్ 19న రెండు పూటలా అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది .ప్రస్తుతం ఈ అన్నదాన పధకం నిర్విరామంగా ఒక యజ్ఞంలా కొనసాగుతుంది. శ్రీవారి అన్నప్రసాదాన్ని నాణ్యతా ప్రమాణాలతో నిర్వహించేందుకు దేవస్థానం చిత్తశుద్ధితో పని చేస్తోంది.శుచి, రుచిలను మిళితం చేసి భక్తులకు ప్రతిరోజు పప్పు ,కూర, పచ్చడి, సాంబారు, మజ్జిగ అన్నంలో వడ్డిస్తున్నారు. ఈ అన్నదాన విభాగంలో ఉద్యోగులతోపాటు సేవే పరమావధిగా ప్రతిఫలాపేక్ష లేకుండా కొందరు సేవకులు అన్న ప్రసాదం పంపిణీ లో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు .దీంతో ప్రతిరోజు వేలాది మంది భక్తులు రెండు పూటలా స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. సాధారణ రోజుల్లో 3వేలు నుంచి 5 వేల మంది భక్తులు స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉంటే శని ,ఆదివారాలతో పాటు ఇతర పర్వదినాలలో ఈ సంఖ్య మరింతగా పెరుగుతుంది .దాతలు ఇచ్చే విరాళాలతో ఈ పథకం దిగ్విజయంగా ముందుకు సాగుతూ తన ప్రస్థానాన్ని చాటుకుంటుంది. అన్నదానం ప్రారంభం నాటి నుంచి ఇప్పటి వరకు దాతలు ఈ పథకానికి రూ.42,34,15,917 విరాళాలను అందజేశారు. ఈ మొత్తాన్ని దేవస్థానం బ్యాంకులో డిపాజిట్ చేసి దీనిపై నెలవారీ వచ్చే వడ్డీ సుమారు రూ.24 లక్షలను అన్నదాన కార్యక్రమానికి ఖర్చు చేస్తోంది . ఈ వడ్డీ సొమ్ముకు ఒకరోజు విరాళాలు కలిపి నెలకు సుమారు రూ.45 లక్షల నుంచి రూ.50 లక్షలు వరకు వెచ్చిస్తుంది . నెలకు సుమారు లక్షా ఎనభై వేల మంది భక్తులు స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. అన్న ప్రసాదాన్ని వితరణ చేస్తూ సుదూర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికుల ఆకలి తీరుస్తున్నారు.

Conclusion:చిన్న వెంకన్న దర్శనార్థం క్షేత్రానికి వచ్చే భక్తులకు సౌకర్యాలను ఏర్పాటుచేయడంతో పాటు శ్రీవారి అన్నదానంలో భక్తులకు నాణ్యత ప్రమాణాలతో కూడిన భోజనాన్ని వడ్డించేలా ఆలయ ఈవో దంతులూరి పెద్దిరాజు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.